అనంత్-రాధికల పెళ్లికి ప్రభుత్వం సెలవు ప్రకటించాలి !!
ఆసియాలోనే అత్యంత ధనవంతుడైన ముఖేశ్ అంబానీ ఇంట్లో పెళ్లంటే మామూలుగా ఉంటుందా..! ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖులు ఎందరో ఈ వివాహానికి హాజరవుతారు. అందుకే వారికి ట్రాఫిక్ సమస్యలు ఎదురవకుండా ఉండేందుకు ముంబయి ట్రాఫిక్ పోలీసులు చర్యలు చేపట్టారు. అందులో భాగంగా ముందస్తు ప్రకటన విడుదల చేశారు.
ఆసియాలోనే అత్యంత ధనవంతుడైన ముఖేశ్ అంబానీ ఇంట్లో పెళ్లంటే మామూలుగా ఉంటుందా..! ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖులు ఎందరో ఈ వివాహానికి హాజరవుతారు. అందుకే వారికి ట్రాఫిక్ సమస్యలు ఎదురవకుండా ఉండేందుకు ముంబయి ట్రాఫిక్ పోలీసులు చర్యలు చేపట్టారు. అందులో భాగంగా ముందస్తు ప్రకటన విడుదల చేశారు. జులై 12 నుంచి 15 వరకు అనంత్-రాధికల వివాహ వేడుక జరిగే బాందాకుర్లా కాంప్లెక్స్ లోని జియో కన్వెన్షన్ సెంటర్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని ఎక్స్ వేదికగా తెలిపారు. ఈ ట్వీట్‌పై స్పందించిన ఓ నెటిజన్, అంబానీ ఇంట పెళ్లికి ప్రభుత్వం సెలవు ప్రకటించాలి అని కామెంట్ చేశారు. అదికాస్తా వైరల్‌గా మారింది. ముంబయి ట్రాఫిక్ పోలీసులు ఎక్స్ లో విడుదల చేసిన ప్రకటన ప్రకారం..2024 జులై 12 నుంచి 15 వరకు ముంబయిలోని బాందాకుర్లా కాంప్లెక్స్‌లోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో సామాజిక కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దీనికి పెద్ద సంఖ్యలో అతిథులు, వీఐపీలు వస్తున్నారు. దాంతో భద్రతా కారణాల వల్ల జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ వైపునకు వెళ్లే వాహనాలను వేరే మార్గానికి మళ్లిస్తున్నామని తెలిపారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
24 ప్రీమియం ఎకానమీ సీట్లతో.. ఎయిరిండియా సరికొత్త విమానం..
15 రోజుల పసికందును బతికుండగానే !! పాకిస్థాన్‌లో ఘటన
40 మందితో తాళి కట్టించుకున్న నిత్య పెళ్లి కూతురు
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

