Viral Video: ఏమంటూ సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిందో ప్రతీ ఒక్కరూ తమ ప్రతిభను ప్రపంచానికి చాటి చెబుతున్నారు. ముఖ్యంగా యాక్టర్ కావాలనుకొని మరేదో అయిన వాళ్లు రీల్స్ పుణ్యామా తమలోని యాక్టింగ్ ట్యాలెంట్‌ను బయటపెడుతున్నారు. తమ వృత్తిని కొనసాగిస్తూనే మరోవైపు నటనపై ఉన్న ఇష్టాన్ని సోషల్ మీడియా వేదికగా చాటి చెబుతున్నారు. తాజాగా ముంబయికి చెందిన ఆయాత్ అనే ఎయిర్ హోస్టెస్ తనలోని ట్యాలెంట్‌తో నెటిజన్లను కట్టిపడేస్తోంది. ఆకట్టుకునే రూపమే కాకుండా అద్భుతమైన నటనతో ఫిదా చేస్తోంది.
ఇప్పటికే పలు వీడియోల ద్వారా నెట్టింట తెగ ట్రెండింగ్‌గా మారిన ఈ ఎయిర్ హోస్టెస్ తాజాగా పుష్ప సినిమాలోని సామి సామి పాటకు స్టెప్పులేసి తెలుగు వారిని కూడా ఫిదా చేసింది. చీర కట్టులో, ఒంటి నిండా నగలు ధరించిన ఆయాత్ సామి సామి పాట కాలు కదిపింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
కామెంట్లు, లైక్‌ల వర్షం కురిపిస్తున్నారు. ఈ ఎయిర్ హోస్టెస్ గతంలోనూ చేసిన కొన్ని వీడియోలు ఇలాగే వైరల్ అయ్యాయి. శ్రీవల్లి హిందీ వెర్షన్‌కు ఈమె పలికిన ఎక్స్‌ప్రెషన్స్ కూడా ఆకట్టుకున్నాయి. ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉన్న పుష్ప సాంగ్‌కు డ్యాన్స్ చేయడంతో ఈ క్రేజ్ మరింత పెరిగింది. ఆయాత్‌ను ఇప్పటి వరకు ఇన్‌స్టాగ్రామ్‌లో సుమారు 4 లక్షల మంది ఫాలో అవుతుండడం విశేషం. మరి తన ట్యాలెంట్‌తో నెటిజన్లను ఫిదా చేస్తున్న ఈ ఎయిర్ హోస్టెస్ వీడియోలను మీరూ ఓసారి చూసేయండి..
Also Read: Shweta Tiwari: వెకిలి మాటలతో నవ్వుల పాలైన బాలీవుడ్ నటి.. కేసు నమోదు చేసిన పోలీసులు..
OIL India Jobs: ఆయిల్ ఇండియా లిమిటెడ్‌లో 62 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. పూర్తి వివరాలివే..