Viral Video: బతకాలంటే ఈ మాత్రం తెగువ ఉండాల్సిందే.. పాము దాడి నుంచి ఎలుక ఎలా తప్పించుకుందో చూడండి.
Viral Video: ఈ సృష్టిలో బతకాలంటే పోరాటం చేయాల్సిందే. ఆహారం సంపాదించుకోవడానికి పోరాటం, ఇతరుల నుంచి రక్షించుకోవడానికి పోరాటం ఇలా ఇదొక నిత్యకృత్యం. దీనికి కేవలం మనుషులే కాకుండా జంతుజీవాలు కూడా అథితులేం కాదు. తమ ఉనికి ప్రశ్నార్థకంగా...
Viral Video: ఈ సృష్టిలో బతకాలంటే పోరాటం చేయాల్సిందే. ఆహారం సంపాదించుకోవడానికి పోరాటం, ఇతరుల నుంచి రక్షించుకోవడానికి పోరాటం ఇలా ఇదొక నిత్యకృత్యం. దీనికి కేవలం మనుషులే కాకుండా జంతుజీవాలు కూడా అథితులేం కాదు. తమ ఉనికి ప్రశ్నార్థకంగా మారొద్దంటే ఎదుటి జీవితో పోరాటం చేయాల్సిందే. పోరాటం చేయలేని చోట తప్పించుకోవడమైనా తెలిసి ఉండాలి. ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోన్న ఈ వీడియో ఇదే విషయాన్ని చెబుతోంది.
తనకంటే పెద్ద జీవి దాడి నుంచి తప్పించుకోవడానికి ఓ ఎలుక చూపిన తెగువ, చురుకుతనం నెటిజన్లు ఎంతగానో ఆకట్టుకుంటోంది. వివరాల్లోకి వెళితే ఓ ఎడారిలో ఎలుక అటుగా వెళుతోంది. అదే సమయంలో అక్కడే ఉన్న ఓ త్రాచుపాము ఎలుకను అమాంతం మింగేద్దామని ప్రయత్నించింది. అయితే ఈ విషయాన్ని ముందుగానే గుర్తించిన ఆ ఎలుక ఎక్క ఎత్తున పైకి ఎగిరి, రెండు కాళ్లతో పామును తన్నింది. పాము నోటికి చిక్కకుండా తుర్రుమని అక్కడి నుంచి పారిపోయింది.
ఈ సంఘటనకు సంబంధించిన విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తమ ప్రాణాల మీదికి వచ్చినప్పుడు ఈ ఎడారి ఎలుకలు తమ చురుకుదనాన్ని ప్రదర్శించిన తీరు అందరినీ ఆకట్టుకుంటోంది. ప్రాణం మీదికొస్తే మనకంటే బలవంతులను అయినా ధీటుగా ఎదుర్కోవడం అనివార్యమని చెప్పడానికి ఈ వీడియో నిదర్శనంగా నిలుస్తోంది. మరి నెట్టింట వైరల్ అవుతోన్న ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి..
View this post on Instagram
Coronavirus: కొవిడ్ బారిన పడిన ప్రముఖ సింగర్.. బెడ్ పై నుంచి లేవలేకపోతున్నానంటూ..
India Coronavirus: గుడ్‌న్యూస్.. దేశంలో క్రమంగా తగ్గుతున్న కరోనా కేసులు.. కానీ..