Monkey Viral Video: చెట్టుకొమ్మలో ఇరుక్కున్న కోతిపిల్ల..తల్లడిల్లిన తల్లికోతి..! చివరికి ఏమైంది అంటే..
నెట్టింట ఎన్నో వైరల్ వీడియోలు చూస్తుంటాం. అవి సంతోషాన్ని, ఆశ్చర్యాన్ని కలిగిస్తే.. మరి కొన్ని మనసులను టచ్ చేస్తాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది.
వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ చిన్న కోతి పిల్ల చెట్టు ఎక్కుతోంది. అది మరీ చిన్నగా ఉంది. అది స్వతహాగా చెట్టు ఎక్కడానికి ప్రయత్నిస్తున్నట్టుంది. చుట్టూ మరే ఇతర కోతులూ లేవు. దాంతో తానొక్కతే చెట్టు ఎక్కుతోంది. ఈ క్రమంలో పట్టుతప్పి రెండు కొమ్మల మధ్యలో ఇరుక్కుపోయింది. ఆ కొమ్మల మధ్య కోతిపిల్ల మెడ బిగుసుకుపోతోంది. దానినుంచి విడిపించుకోడానికి ఆ చిన్ని కోతి ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఇంతలో ఎక్కడినుంచో ఇది గమనించిన తల్లి కోతి తన బిడ్డ అవస్థను చూసి తల్లడిల్లిపోయింది. ఒక్క ఉదుటన అక్కడికివచ్చి తన బిడ్డను కాపాడుకుంది. ఆ చిన్నికోతిని తన హృదయానికి హత్తుకుంది. ఈ క్యూట్ వీడియోను వేలాది మంది వీక్షిస్తూ లైక్ చేస్తున్నారు. తమదైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Young man – father: యువకుడి తొందరపాటుకి.. పాపం తండ్రి బలి.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో..
ప్రేమికులను వేటాడి చంపిన కసాయి అన్నలు
దొంగలు దోచుకెళ్లిన బంగారం.. ఇంటిముందు ప్రత్యక్షం
అక్కడ నాగరాజు దర్శనం.. అద్భుతాలు తథ్యం అంటున్న భక్తులు
సాఫ్ట్‌వేర్ ఇంజనీర్పై ఇద్దరు భార్యలు ఫిర్యాదు..
ప్రమాదంలో పిల్ల కోతి.. హైటెన్షన్ వైర్లను లెక్కచేయని తల్లి
కూతురికి ప్రేమతో.. పెళ్లికార్డుకే రూ. 25 లక్షలు ఖర్చు
భార్యను చెల్లిగా పరిచయం చేసాడు.. మరో పిల్లకి కోట్లు లో టోకరా

