5

మెట్రోలో ట్రెండ్‌ మారింది.. ఇప్పుడు జంతువుల వంతు..

డిల్లీ మెట్రోలో ఇప్పటివరకూ ప్రయాణీకులు డ్యాన్స్‌లు చేయటం, పాటలు పాడటం, స్నానం చేయడం, కొందరు హద్దులు మీరి రొమాన్స్ చేయడం చూసాం. అయితే ఈ సారి ఢిల్లీ మెట్రో అనేది మనుషులకే కాదు.. జంతువులకు కూడా తమలోని ప్రతిభను ప్రదర్శించేందుకు అడ్డాగా మారింది.

|

Updated on: May 31, 2023 | 9:55 PM

డిల్లీ మెట్రోలో ఇప్పటివరకూ ప్రయాణీకులు డ్యాన్స్‌లు చేయటం, పాటలు పాడటం, స్నానం చేయడం, కొందరు హద్దులు మీరి రొమాన్స్ చేయడం చూసాం. అయితే ఈ సారి ఢిల్లీ మెట్రో అనేది మనుషులకే కాదు.. జంతువులకు కూడా తమలోని ప్రతిభను ప్రదర్శించేందుకు అడ్డాగా మారింది. ఓ కోతి మెట్రో ట్రైన్‌లో ప్రయాణిస్తూ రకరకాల విన్యాసాలు చేసింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. అయితే అకస్మాత్తుగా ఓ కోతి మెట్రోలోకి ప్రవేశిస్తే సీన్ ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఇంత భద్రత మధ్య అదేలా సాధ్యమని అనుకుంటున్నారు కదా..! కానీ, ఇది ఢిల్లీ మెట్రో.. ఇక్కడ అన్ని రకాల వింతలు విడ్డూరాలు కనిపిస్తాయి. అలాంటి దృశ్యాలను ఎవరూ ఊహించలేరు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. మొదటిసారి రైల్లో ప్రయాణిస్తున్న ఆ కోతి మెట్రో జర్నీని బాగా ఎంజాయ్‌ చేసింది. అక్కడ స్తంభాలపైకి ఎక్కుతూ జారుతూ, అటూ ఇటూ గెంతుతూ రచ్చ రచ్చ చేసింది. తోటి ప్రయాణికులు కూడా దాని ఫ్రీడంని అడ్డుకోలేదు. అయితే ఆ కోతి అనుకోకుండా రైల్లోకి ఎక్కినట్టు అనిపిస్తోంది. అది అటూ ఇటూ తిరుగుతున్నప్పుడు రైలునుంచి బయటపడటానికి మార్గం వెతుకుతున్నట్టనిపించింది. ఎక్కడా దారిలేక చివరికి అక్కడే ఓ సీటులో కూర్చున్న వ్యక్తికి వద్దకు వెళ్లి సైలెంట్‌గా కూర్చుంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సూపర్‌ ఎయిర్‌ కండిషనర్‌.. కేవలం రూ.10/-లకే

తవ్వకాల్లో బయటపడిన 30 వేల ఏళ్లనాటి జీవి మమ్మీ..

బైక్‌లో పెట్రోల్‌ కొట్టిస్తూ లైటర్‌ వెలిగించిన యువకుడు.. షాకింగ్‌ వీడియో వైరల్‌

సో క్యూట్‌.. భారతీయ రుచులకు ఫిదా అవుతున్న న్యూయార్క్‌ చిన్నారి

అంతరించిపోతున్న అరుదైన జంతువు..

 

Follow us