బైక్‌లో పెట్రోల్ కొట్టిస్తూ లైటర్ వెలిగించిన యువకుడు.. షాకింగ్ వీడియో వైరల్
మధ్యప్రదేశ్ రాష్ట్రం భోపాల్ లో షాకింగ్ ఘటన ఒకటి చోటు చేసుకుంది. పెట్రోల్ కొట్టించుకునేందుకు బైక్ పై వచ్చిన ముగ్గురు వ్యక్తుల్లోని ఓ యువకుడు లైటర్ తో నిప్పు అంటించాడు. ఈ ఘటనలో బైక్ సహా పెట్రోల్ నాజల్‌కు మంటలు అంటుకున్నాయి. వెంటనే స్పందించిన సిబ్బంది మంటలు అదుపు చేయడంతో..
మధ్యప్రదేశ్ రాష్ట్రం భోపాల్ లో షాకింగ్ ఘటన ఒకటి చోటు చేసుకుంది. పెట్రోల్ కొట్టించుకునేందుకు బైక్ పై వచ్చిన ముగ్గురు వ్యక్తుల్లోని ఓ యువకుడు లైటర్ తో నిప్పు అంటించాడు. ఈ ఘటనలో బైక్ సహా పెట్రోల్ నాజల్‌కు మంటలు అంటుకున్నాయి. వెంటనే స్పందించిన సిబ్బంది మంటలు అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పింది. స్థానిక పోలీసుల వివరాల ప్రకారం.. కటారాహిల్స్‌లోని స్ప్రింగ్ వ్యాలీ కాలనీలో గల రేణుక పెట్రోల్ పంపు వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ముగ్గురు వ్యక్తులు బైక్‌పై పెట్రోల్ కోసం వచ్చారు. ఈ క్రమంలో ఆ సమయంలో డ్యూటీలో ఉన్న సిబ్బంది బండిలో పెట్రోల్ నింపుతుండగా.. ముగ్గురులోని ఓ వ్యక్తి ఉన్నట్టుండి తన జోబులోని లైటర్‌తీసి అంటించాడు. దీంతో బైక్, పెట్రోల్ నాజల్‌కు క్షణాల్లో మంటలు అంటుకున్నాయి. అప్రమత్తమైన సిబ్బంది బకెట్లతో ఇసుకను తీసుకొచ్చి మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఓ వ్యక్తికి గాయాలయ్యాయి. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ముగ్గురిపై కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న ఇద్దరి కోసం గాలింపు చేపడుతున్నారు. కాగా, దెబ్బతిన్న పెట్రోల్ పంపు నాజల్ విలువ సుమారు రూ.8,000 వరకు ఉంటుందని అంచనా. ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సో క్యూట్.. భారతీయ రుచులకు ఫిదా అవుతున్న న్యూయార్క్ చిన్నారి
అంతరించిపోతున్న అరుదైన జంతువు..
నీళ్లలో పడి మునిగిపోతున్న కాకి.. అక్కడే ఉన్న ఎలుగుబంటి ఏం చేసిందో చూడండి
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు
సర్పంచ్‌గా గెలుపే లక్ష్యం.. అందుకే ప్రజలు వింత కోరికను తీర్చాము
పుతిన్ వెంట 'మలం' సూట్‌కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా

