సూపర్‌ ఎయిర్‌ కండిషనర్‌.. కేవలం రూ.10/-లకే

మనదేశంలో జుగాడ్‌లకు కొదువేలేదు. అందుకే, దేశీ జుగాడ్‌కి సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా వేసవిలో వేడి నుండి తప్పించుకోవడానికి ప్రజలు అనేక దేశీ జుగాడ్‌లను ప్రయత్నిస్తున్నారు. ఎండవేడిమి, ఉక్కపోతను తప్పించుకోవటానికి వింత వింత పరికరాలను..

సూపర్‌ ఎయిర్‌ కండిషనర్‌.. కేవలం రూ.10/-లకే

|

Updated on: May 31, 2023 | 9:54 PM

మనదేశంలో జుగాడ్‌లకు కొదువేలేదు. అందుకే, దేశీ జుగాడ్‌కి సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా వేసవిలో వేడి నుండి తప్పించుకోవడానికి ప్రజలు అనేక దేశీ జుగాడ్‌లను ప్రయత్నిస్తున్నారు. ఎండవేడిమి, ఉక్కపోతను తప్పించుకోవటానికి వింత వింత పరికరాలను తయారు చేస్తున్నారు. తాజాగా హోం మేడ్‌ ఏసీ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ దేశీ జుగాడ్ చూసిన తర్వాత మీరు కూడా ఆ వ్యక్తిని మెచ్చుకోకుండా ఉండలేరు. ఓ వ్యక్తి కేవలం 10 రూపాయలు ఖర్చు పెట్టి పాత కూలర్‌తో ఏసీని తయారు చేశాడు. అందుకోసం కొని పాత మట్టి కుండలను పగలగొట్టి ఆ పెక్కులను పాడైపోయిన పాత కూలర్ అడుగున వేశాడు. ఆ తర్వాత ఒక కుండను కూలర్ మధ్యలో పెట్టి దానిలో ఒక పైప్‌ ద్వారా నీటిని నింపాడు. అందులోనే మరో పైప్‌ ద్వారా కూలర్‌ చుట్టూ ఉన్న గడ్డిని తడిపేలా ఏర్పాటు చేశాడు. ఆ తర్వాత కూలర్ ఆన్ చేశాడు. ఈ దేశీ జుగాడ్‌ను కేవలం 10 రూపాయల వ్యయంతో చేసినట్టుగా పేర్కొన్నాడు. ఈ ఫన్నీ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఈ వీడియో క్యాప్షన్‌లో ‘కేవలం 10 రూపాయలతో ఇంట్లో తయారు చేసిన ఏసీ’ అంటూ క్యాప్షన్‌ ఇచ్చారు. ఈ వీడియోను ఇప్పటికే కోట్లాదిమంది వీక్షించగా.. దాదాపు 9 లక్షలమందికి పైగా లైక్‌ చేశారు. వీడియో చూసిన యూజర్లు ఒక్కొక్కరుగా ఒక్కో విధంగా కామెంట్స్ చేస్తున్నారు. అదే సమయంలో కొంతమంది వినియోగదారులు వ్యక్తి ప్రతిభను అభినందిస్తున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

తవ్వకాల్లో బయటపడిన 30 వేల ఏళ్లనాటి జీవి మమ్మీ..

బైక్‌లో పెట్రోల్‌ కొట్టిస్తూ లైటర్‌ వెలిగించిన యువకుడు.. షాకింగ్‌ వీడియో వైరల్‌

సో క్యూట్‌.. భారతీయ రుచులకు ఫిదా అవుతున్న న్యూయార్క్‌ చిన్నారి

అంతరించిపోతున్న అరుదైన జంతువు..

నీళ్లలో పడి మునిగిపోతున్న కాకి.. అక్కడే ఉన్న ఎలుగుబంటి ఏం చేసిందో చూడండి

 

Follow us