Wyra: కరెంట్ షాక్‌తో కోతి మృతి.. ఆ యువకులు ఏం చేశారో తెలిస్తే

Wyra: కరెంట్ షాక్‌తో కోతి మృతి.. ఆ యువకులు ఏం చేశారో తెలిస్తే

| Edited By: Ram Naramaneni

Updated on: Aug 19, 2023 | 10:35 PM

పాపం వానరం కరెంట్ షాక్ కొట్టడంతో మృతి చెందింది. దీంతో తోటి వానరాలు ఎంతో ఆవేదన చెందాయి. కాగా ఆ కోతికి మనుషుల మాదిరిగా అంత్యక్రియలు నిర్వహించారు స్థానిక యువకులు. కోతి అంటే ఆంజనేయ స్వామితో సమానమని.. అందులో ఘనంగా అంతిమ సంస్కారాలు నిర్వహించినట్లు వారు తెలిపారు.

ఖమ్మం జిల్లా వైరాలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ గురై కోతి మృతి చెందింది. సాధారణంగా తోటి మనుషులు చనిపోతేనే పట్టించుకోని కాలం ఇది. ఇక జంతువులు మృతి చెందితే పెద్దగా పట్టించుకుంటారా చెప్పండి. ఇంటి పక్కన ఏవైనా జంతువులు చనిపోతే స్మెల్ వస్తుందని దూరంగా పడేస్తారు. అలాంటిది విద్యుత్ షాక్ తో కోతి మృతి చెందిన సంఘటన తెలుసుకున్న యువకులు వెంటనే స్పందించి.. దానికి అంత్యక్రియలు నిర్వహించి మానవత్వాన్ని చాటుకున్నారు. మనుషులకు ఏ విధంగా అయితే అంత్యక్రియలు నిర్వహిస్తారో.. కోతికి కూడా అదే విధంగా రిక్షాపై ఊరేగిస్తూ కోతికి అంత్యక్రియలు నిర్వహించారు. కోతికి హిందూ సాంప్రదాయంగా అంత్యక్రియలు నిర్వహించటంతో స్థానికులు యువకులను అభినందించారు.

Follow us