దెయ్యాల ప్యాలెస్.. ఎగిరే వైన్ గ్లాసులు.. రాత్రుళ్లు వింత శబ్దాలు
ప్రపంచంలో దెయ్యాలు, భూతాల కథలతో ముడిపడిన అనేక ప్రాంతాలు కనిపిస్తాయి. పాకిస్తాన్ రాజధాని కరాచీలోనూ అటువంటి మహల్ ఒకటంది. అదే మొహట్టా ప్యాలెస్. 1927లో రాజస్థాన్‌కు చెందిన ఒక హిందూ వ్యాపారి నిర్మించిన ఈ ప్యాలెస్‌ను పాకిస్తాన్ సర్కారు మ్యూజియంగా మార్చింది. అయినప్పటికీ నేటికీ రాత్రి వేళ ఇక్కడకు వెళ్లే సాహసం ఎవరూ చేయరు. పెద్ద ఎత్తున పార్టీలు జరుగుతున్నట్లు రాత్రి వేళ ఏవో శబ్ధాలు వస్తుంటాయని సెక్యూరిటీ గార్డులు చెబుతారు.
ప్రపంచంలో దెయ్యాలు, భూతాల కథలతో ముడిపడిన అనేక ప్రాంతాలు కనిపిస్తాయి. పాకిస్తాన్ రాజధాని కరాచీలోనూ అటువంటి మహల్ ఒకటంది. అదే మొహట్టా ప్యాలెస్. 1927లో రాజస్థాన్‌కు చెందిన ఒక హిందూ వ్యాపారి నిర్మించిన ఈ ప్యాలెస్‌ను పాకిస్తాన్ సర్కారు మ్యూజియంగా మార్చింది. అయినప్పటికీ నేటికీ రాత్రి వేళ ఇక్కడకు వెళ్లే సాహసం ఎవరూ చేయరు. పెద్ద ఎత్తున పార్టీలు జరుగుతున్నట్లు రాత్రి వేళ ఏవో శబ్ధాలు వస్తుంటాయని సెక్యూరిటీ గార్డులు చెబుతారు. తెల్లారాక చూస్తే వైన్ గ్లాసులు వాటి స్థానంలో ఉండవని సర్ది పెడుతుంటారని అంటుంటారు. 1927లో శివరతన్ చంద్రరతన్ అనే మార్వాడీ వ్యాపారి భార్యపై ప్రేమకు గుర్తుగా ఈ ప్యాలెస్ నిర్మించారు. అనారోగ్యంతో బాధపడుతున్న భార్య కోలుకోవాలంటే సముద్రపు గాలి తగిలే ప్రాంతంలో ఆమెను ఉంచితే, ఆమె ఆరోగ్యం కుదుటపడుతుందని వైద్యులు సూచించారు. అలా నిర్మించిన ప్యాలెస్‌లో లెక్కకుమించిన సంఖ్యలో విందువినోద కార్యక్రమాలు జరిగేవని చెబుతుంటారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వీళ్ల తెలివి మాములుగా లేదుగా !! సిగ్నల్ లైట్ లేదని ??
ఈ పక్షిని గుర్తుపట్టండి.. ప్రభుత్వ ఉద్యోగం పట్టేయండి..
ఆ ద్వీపానికి వెళితే అంతమే !! నిర్దాక్షిణ్యంగా చంపేస్తారు
ప్రియుడితో కలిసి తండ్రి హత్యకు ప్లాన్ !! 60వేల రూపాయిల సుపారీ
Tomato price: టమోటా ధర ఢమాల్-రైతుల్లో నిరాశ