ఈ పక్షిని గుర్తుపట్టండి.. ప్రభుత్వ ఉద్యోగం పట్టేయండి..

ఈ పక్షిని గుర్తుపట్టండి.. ప్రభుత్వ ఉద్యోగం పట్టేయండి..

Phani CH

|

Updated on: Aug 11, 2023 | 9:59 PM

పక్షి ఏంటి దానిని కనిపెడితే ప్రభుత్వ ఉద్యోగం ఏంటి అని అనుకుంటున్నారా.? అవును నిజమే అంతరించిపోయిన పక్షి జాతిలో అత్యంత అరుదైన పక్షి కలివి కోడి. నిజానికి ఇది కోడి కాదు, అరుదైన పక్షి. ప్రపంచంలో ఈ పక్షి అంతరించిపోయిందని అందరూ భావించారు. పక్షిశాస్త్ర నిపుణులు కూడా ఈ జాతి 1948లోనే అంతరించి పోయిందని నిర్దారించారు. అయితే 1986 లో కడప జిల్లాలోఈ పక్షి కనిపించింది. కేంద్ర ప్రభుత్వం కలివికోడిని వెతకటానికి కోట్లు ఖర్చు చేసింది. ఇంకా చేస్తూనే ఉంది.

పక్షి ఏంటి దానిని కనిపెడితే ప్రభుత్వ ఉద్యోగం ఏంటి అని అనుకుంటున్నారా.? అవును నిజమే అంతరించిపోయిన పక్షి జాతిలో అత్యంత అరుదైన పక్షి కలివి కోడి. నిజానికి ఇది కోడి కాదు, అరుదైన పక్షి. ప్రపంచంలో ఈ పక్షి అంతరించిపోయిందని అందరూ భావించారు. పక్షిశాస్త్ర నిపుణులు కూడా ఈ జాతి 1948లోనే అంతరించి పోయిందని నిర్దారించారు. అయితే 1986 లో కడప జిల్లాలోఈ పక్షి కనిపించింది. కేంద్ర ప్రభుత్వం కలివికోడిని వెతకటానికి కోట్లు ఖర్చు చేసింది. ఇంకా చేస్తూనే ఉంది. దీనిని కనిపెట్టిన వారికి అటవీశాఖలో ఉద్యోగం ఇస్తామని కూడా ఆఫర్ ఇచ్చింది. కడప జిల్లాలో అటు శేషాచలం ఇటు నల్లమల అడవులు ఉన్నాయి. జిల్లాలోని సిద్దవటం, బద్వేలు ప్రాంత అడవిని ‘లంకమల’గా పేర్కొంటారు. ఈ అడవిలో ఎన్నోజాతుల పక్షులు, జంతువులు ఉన్నాయి. ఈ అడవిలోనే కలివికోడి కనిపించింది. కలివి పొదల్లో ఈ జాతి పక్షులు ఉండడంతో దీనికి ఆ పేరు వచ్చింది. 1948 నాటికే ఈ పక్షి జాతి అంతరించిపోయిందని నిర్ధారించిన పక్షిశాస్త్ర నిపుణులకు షాకిస్తూ అనూహ్యంగా 1986లో ఈ పక్షి దర్శనమిచ్చింది. జనవరి 5న అట్లూరు మండలం రెడ్డిపల్లె వాసి చిన్న ఐతయ్యకంటపడింది ఈ పక్షి. ఐతయ్య దాన్ని పట్టుకుని అటవీ అధికారులకు అప్పగించడంతో వారు దాన్ని కలివికోడిగా గుర్తించారు. ఈ విషయాన్ని ప్రముఖ పక్షి శాస్త్రవేత్త నిపుణులు సలీం అలీకి తెలపడంతో ఆయన వెంటనే లంకమల అటవీ ప్రాంతానికి వచ్చి ఆ పక్షిని పరిశీలించారు. అయితే దురదృష్ట వశాత్తు ఆ పక్షి ఆయన చేతిలోనే మరణించింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆ ద్వీపానికి వెళితే అంతమే !! నిర్దాక్షిణ్యంగా చంపేస్తారు

ప్రియుడితో కలిసి తండ్రి హత్యకు ప్లాన్ !! 60వేల రూపాయిల సుపారీ

Tomato price: టమోటా ధర ఢమాల్-రైతుల్లో నిరాశ

ద్వారాకా తిరుమల ఆలయం వద్ద అమానుషం !! దైవ సన్నిధిలోనే ??

జాగ్రత్త !! మీరు తాగేదీ పాలు కాదు.. కాలకూట విషం