జాగ్రత్త !! మీరు తాగేదీ పాలు కాదు.. కాలకూట విషం
లోకి ఏం కావాలి? పాలు కావాలి. పిల్లలు తాగాలన్నా మిల్క్ కావాలి. అయితే తెల్లనివన్నీ పాలు అంటూ మనకు అంటగట్టేస్తున్నారు కొందరు కల్తీ కేటుగాళ్లు. తెల్లనివన్నీ ఎలా పాలు కాదో మనం తాగేవి కూడా పాలు కాదు. మనకు తెలియకుండానే.. మన కడుపులోకి, మన పిల్లల బొజ్జల్లోకి కాలకూట విషం చేరుతోంది. ఇప్పుడు కల్తీ పాల రూపంలో రోజూ కొంచెంగా మన శరీరంలోకి చేరుతోంది. తాజాగా ఈ గుట్టును రట్టు చేశారు రాచకొండ ఎస్‌వోటీ పోలీసులు. యాదాద్రి జిల్లా పాడి పరిశ్రమకు పెట్టింది పేరు.
లోకి ఏం కావాలి? పాలు కావాలి. పిల్లలు తాగాలన్నా మిల్క్ కావాలి. అయితే తెల్లనివన్నీ పాలు అంటూ మనకు అంటగట్టేస్తున్నారు కొందరు కల్తీ కేటుగాళ్లు. తెల్లనివన్నీ ఎలా పాలు కాదో మనం తాగేవి కూడా పాలు కాదు. మనకు తెలియకుండానే.. మన కడుపులోకి, మన పిల్లల బొజ్జల్లోకి కాలకూట విషం చేరుతోంది. ఇప్పుడు కల్తీ పాల రూపంలో రోజూ కొంచెంగా మన శరీరంలోకి చేరుతోంది. తాజాగా ఈ గుట్టును రట్టు చేశారు రాచకొండ ఎస్‌వోటీ పోలీసులు. యాదాద్రి జిల్లా పాడి పరిశ్రమకు పెట్టింది పేరు. హైదరాబాద్‌కు అతి సమీపాన ఉండడంతో నిత్యం లక్షలాది లీటర్ల పాలు హైదరాబాద్ కు ఎగుమతి అవుతున్నాయి. ఇదే అదనుగా కొందరు కేటుగాళ్లు పాలను కల్తీ చేస్తూ అక్రమార్జనకు పాల్పడుతున్నారు. తాజాగా చౌటుప్పల్ మండలం కైతాపురంలో కల్తీ పాల తయారీ కేంద్రంపై రాచకొండ ఎస్‌వోటీ పోలీసులు దాడి చేశారు. పక్కా సమాచారంతో పాల వ్యాపారి మల్లారెడ్డి ఇంట్లో పాలు కల్తీ చేస్తున్నట్లు గుర్తించారు. అతని నుంచి 60 లీటర్ల కల్తీ పాలు, 500 మిల్లి లీటర్ల హైడ్రోజన్ పెరాక్సైడ్, 4 కేజీల దోల్పూర్ స్కిమ్ పాల పౌడర్‌ను స్వాధీనం చేసుకున్నారు. మల్లారెడ్డిని అదుపులోకి తీసుకన్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
TOP 9 ET News: ‘భోళా శంకర్’ నిలిపివేత | ఆల్ టైం రికార్డ్.. బాక్స్ బద్దలుకొట్టిన బాబు
Digital TOP 9 NEWS: రాస్తారోకో చేసిన కోతులు | దిగి వస్తున్న టమోటా ధరలు