AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tihar jail: కరడుగట్టిన నేరస్తుల అడ్డా.. తీహార్‌ జైలు ప్రత్యేకతలెన్నో.!

Tihar jail: కరడుగట్టిన నేరస్తుల అడ్డా.. తీహార్‌ జైలు ప్రత్యేకతలెన్నో.!

Anil kumar poka
|

Updated on: Mar 29, 2024 | 10:11 PM

Share

దేశంలోని కరుడుగట్టిన నేరస్తులంతా ఉండేది తీహార్ జైలులో . సంచలన కేసుల్లో ప్రముఖ వ్యక్తి లేదా మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్‌ అరెస్ట్ అయ్యారంటే వాళ్ల అడ్డా తీహార్ జైలే. అందుకే ఈ జైలు లోపల బయట హైసెక్యూరిటీతో.. నిరంతరం డేగ కళ్లతో నిఘా ఉంటుంది. దారుణమైన నేరాలకు పాల్పడ్డ రాజకీయ నాయకులు మొదలుకొని నేరం చేసే పారిశ్రామిక వేత్తలు, హంతకులు, ఉగ్రవాదులకు ఇదే కేరాఫ్ అడ్రస్.

దేశంలోని కరుడుగట్టిన నేరస్తులంతా ఉండేది తీహార్ జైలులో . సంచలన కేసుల్లో ప్రముఖ వ్యక్తి లేదా మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్‌ అరెస్ట్ అయ్యారంటే వాళ్ల అడ్డా తీహార్ జైలే. అందుకే ఈ జైలు లోపల బయట హైసెక్యూరిటీతో.. నిరంతరం డేగ కళ్లతో నిఘా ఉంటుంది. దారుణమైన నేరాలకు పాల్పడ్డ రాజకీయ నాయకులు మొదలుకొని నేరం చేసే పారిశ్రామిక వేత్తలు, హంతకులు, ఉగ్రవాదులకు ఇదే కేరాఫ్ అడ్రస్. సంచలనం సృష్టించిన వేలాది కేసుల్లో నిందితులు తీహార్ జైలులోనే ఉన్నారు. ఎంతో మంది రాజకీయ నాయకులు సైతం ఇక్కడ ఊచలు లెక్కబెట్టారు. నేరాలు రుజువు కావడంతో ఎంతోమందిని ఈ జైలులోనే ఉరితీశారు.

దేశ రాజధాని ఢిల్లీలో చాణక్యపురి నుంచి ఏడు కిలో మీటర్ల దూరాన ఉన్న తీహార్‌ గ్రామంలో ఈ జైలు ఉంది. దక్షిణ ఆసియాలోనే అతిపెద్ద కారాగారం. 6 వేల 251 మందికి సరిపడ వసతులున్నా.. ఎప్పుడూ అంతకన్నా ఎక్కువ మంది.. అంటే పదివేలకు మించి ఖైదీలను ఉంచడం చూస్తుంటాం. వీరిలో న్యాయ విచారణను ఎదుర్కొంటున్న అండర్ ట్రయల్ ఖైదీలూ ఉంటారు. ఉదయం 5 గంటలకు చపాతీ, పూరీలు టిఫిన్ గా పెడతారు. మధ్యాహ్నాం పప్పు, అన్నం, సబ్జీ పెడతారు. రాత్రికి కూడా ఇదే మెనూ ఉంటుంది. వారానికి రెండుసార్లు ఖీర్ పెడతారు. ఇక ఖైదీలకు ఇక్కడ నాన్ వెజ్ ఫ్రీగా పెట్టరు. వారు కష్టపడిన డబ్బులతో.. క్యాంటీన్‌లో కొనుక్కుని తినాల్సి ఉంటుంది. కోర్టు అనుమతి ఉన్న ఖైదీలకు ప్రత్యేక వసతి, ఇంటి భోజనానికి అనుమతి ఉంటుంది. 2012లో ఢిల్లీ సామూహిక లైంగికదాడి కేసులో ఐదుగురు నిందితులను తీహార్ జైలులోనే ఉరి తీశారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హత్య కేసులో అత్యంత కీలకమైన కేహార్ సింగ్, సత్వంత్ సింగ్‌లను ఈ జైలులోనే నిర్భంధించారు. పారిశ్రామికవేత్తలను బెదిరించి వందల కోట్ల వసూళ్లకు పాల్పడ్డ సుకేష్ చంద్రశేఖర్, ఒలింపిక్ రజత పతక విజేత సుశీల్ కుమార్, కాశ్మీరీ వేర్పాటువాద నేత యాసిన్ మాలిక్ ఇప్పుడు అక్కడే ఉన్నారు. 2G స్పెక్ట్రమ్ కేసులో అరెస్ట్ అయిన A.రాజా, కనిమొళి.. లిక్కర్ కేసులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత.. ఇలా చాలామందిని తీహార్ జైలులోనే ఉంచారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.

ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.

‘నా భర్త VDలా ఉండాలి.!’ నో కన్ఫూజన్‌ తెలిసిన కాంబినేషనేగా..