ఎర్రగా మారిపోయే రోడ్లు !! విచిత్రం.. పీతల వలసల వెనక కథేంటి ?? వీడియో

చలికాలం వస్తే ఆస్ట్రేలియాలోని క్రిస్మస్‌ ఐలాండ్‌ పర్యాటక ప్రాంతంగా మారిపోతుంది. ఇక్కడ దాదాపుగా రెండు వేల మంది మాత్రమే ప్రజలుంటారు.

చలికాలం వస్తే ఆస్ట్రేలియాలోని క్రిస్మస్‌ ఐలాండ్‌ పర్యాటక ప్రాంతంగా మారిపోతుంది. ఇక్కడ దాదాపుగా రెండు వేల మంది మాత్రమే ప్రజలుంటారు. ఉన్నట్టుండి ఈ దీవిలో వీధులన్నీ ఎర్రగా మారిపోతాయి. ఎందుకో వాటి వెనకున్న ఆసక్తికరమైన కథేంటో చూసినట్లయితే.. ఇక్కడ కొద్దిగా నివాసప్రాంతాలున్నాయి గానీ చాలా మటుకు అడవే. అందులో లక్షల్లో ఎర్ర పీతలుంటాయి. ఇవి మిగిలిన జాతి పీతల్లా నీటిలో కాకుండా నేల మీద బతికేవన్నమాట. తడిగా ఉండే మెత్తని మట్టిలో జీవిస్తాయి. అడవిలోని పండుటాకుల్ని తింటూ బతుకుతాయి. ఇక్కడివి 40, 50 లక్షల వరకూ ఉంటాయని అంచనా. అంటే ఏ చెట్టున, ఏ గట్టున చూసినా ఇవే అన్నమాట. అయితే అక్టోబరు, నవంబరు నెలలు రాగానే ఇక్కడ ఓ చిత్రం చోటు చేసుకుంటుంది. లక్షలాది పెద్ద పెద్ద ఎర్ర పీతలు అడవుల్లోంచి కొండలు, కోనలు దాటుకుంటూ సముద్రంలోకి వలసకు బయలుదేరతాయి.

మరిన్ని ఇక్కడ చూడండి:

Indigo: విమాన టికెట్ ధరలు తగ్గే అవకాశం !! వీడియో

Viral Video: నాకేదీ అడ్డు !! ఇనుప కంచె మీదుగా దూకిన ఏనుగు !! వీడియో

Viral Video: బాబోయ్ 555 పదునైన పళ్ళు !! ఈ రాకాసి చేప యమ డేంజర్‌ !! వీడియో

చిన్నారుల డాన్స్‌కి ఫిదా అయిన సీఎం !! నెట్టింట్లో వైరల్‌గా మారిన వీడియో

సిరాజ్‎ను రోహిత్ శర్మ ఎందుకు కొట్టాడు ?? వైరల్‎గా మారిన వీడియో

 

Click on your DTH Provider to Add TV9 Telugu