AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బాబు..నువ్వు బంగారంరా.. వీడియో

బాబు..నువ్వు బంగారంరా.. వీడియో

Samatha J
|

Updated on: Nov 23, 2025 | 4:39 PM

Share

సాధారణంగా స్కూల్లో పిల్లలకు ఏదైనా వస్తువు దొరికితే దానిని జేబులో వేసుకొని ఇంటికి తీసుకెళ్తారు. అది తల్లిదండ్రులకు చూపితే వారు అలా చేయకూడదని చెప్పి, దానిని స్కూల్లో అప్పగించాలని చెప్పి పంపిస్తారు. కానీ ఓ చిన్నోడు తనకెంతో విలువైన వస్తువు దొరికితే ఒక్క క్షణం ఆలోచించకుండా వెంటనే తీసుకెళ్లి దానిని క్లాస్‌ టీచర్‌కు అప్పగించాడు. ఆ వస్తువు పోగొట్టుకున్న వ్యక్తి తిరిగి దానిని పొందిన తర్వాత అతని ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. దాంతో ఆ పాఠశాలకు రిటర్న్ గిఫ్ట్‌ ఇచ్చి కృతజ్ఞత చాటుకున్నాడు ఆ వ్యక్తి. ఈ ఘటన మెదక్‌ జిల్లాలో జరిగింది.

మెదక్ జిల్లాకు చెందిన ఓ విద్యార్థి తన నిజాయితీని చాటుకున్నాడు. పోగొట్టుకున్న వ్యక్తికి రెండున్నర తులాల బంగారాన్ని తిరిగి అప్పగించి అందరి మన్ననలు పొందాడు. మెదక్ జిల్లా రామాయంపేటకు చెందిన ఓ వ్యక్తి తన కుమారుడిని స్థానిక తెలంగాణ ఆదర్శ పాఠశాలలో దింపేందుకు వచ్చాడు. ఈ క్రమంలో అతని చేతికి ఉన్న బంగారు బ్రేస్‌లెట్‌ పడిపోయింది. ఎంత వెతికినా అది దొరకకపోవడంతో నిరాశతో వెళ్లిపోయాడు. మరుసటి రోజు పాఠశాలకు వచ్చిన ఆరవ తరగతి చదువుతున్న హర్షిత్ అనే విద్యార్థికి ఆ బంగారు బ్రాస్‌లెట్ దొరికింది. ఆ బాలుడు ఎలాంటి ఆలోచన లేకుండా ఆ బ్రేస్‌లెట్‌ను నేరుగా తీసుకెళ్లి తన క్లాస్ టీచర్‌కు అప్పగించాడు. టీచర్ ఎంతో బాధ్యతగా బంగారం పోగొట్టుకున్న వ్యక్తిని గుర్తించి అతడికి అప్పగించారు. విద్యార్థి హర్షిత్ నిజాయితీని పాఠశాల యాజమాన్యం ప్రశంసించింది. పోగొట్టుకున్న రెండున్నర తులాల బంగారు బ్రేస్‌లెట్‌ లభించడంతో ఆ వ్యక్తి ఆనందానికి అవధుల్లేకుండాపోయాయి.

మరిన్ని వీడియోల కోసం :

బ్యాక్ బలంగా ఉండడం అవసరం..సమంత పోస్ట్ వైరల్ వీడియో

ప్లాన్ మార్చిన ఓటీటీ… నిర్మాతలకు నష్టాలు తప్పవా? వీడియో

బిగ్‌బాస్ నిర్వాహకులకు దెబ్బ మీద దెబ్బ వీడియో