వరల్డ్ కప్ గెలిచిన చోటే ..స్మృతి మంధానకు పెళ్లి ప్రపోజల్ వీడియో
భారత మహిళా క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్, స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతోంది. మ్యూజిక్ కంపోజర్ పలాష్ ముచ్ఛల్‌తో ఆమె పెళ్లి నవంబర్ 23న జరగనుంది. వీరు చాలా ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇటీవలే మంధాన తన ఎంగేజ్‌మెంట్ రింగ్‌ను చూపించిన ఒక ఫన్నీ వీడియోను తన టీమ్ మేట్స్‌తో కలిసి షేర్ చేసింది. అయితే ఇప్పుడు పెళ్లికి ముందు పలాష్, స్మృతి మంధానకు ఇచ్చిన బిగ్గెస్ట్ సర్‌ప్రైజ్ గురించిన ఒక వీడియో వైరల్ అవుతోంది.
పలాష్ ముచ్ఛల్,స్మృతి మంధానకు ప్రపోజ్ చేయడానికి ఒక చాలా స్పెషల్ ప్లేస్ ఎంచుకున్నాడు. అదేంటంటే… నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం. ఈ గ్రౌండ్‌లోనే భారత మహిళా జట్టు ఇటీవల 2025 వరల్డ్ కప్ టైటిల్‌ను గెలిచి చరిత్ర సృష్టించింది. సరిగ్గా అదే మైదానంలో పలాష్, స్మృతి మంధానను నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడుగుతూ సర్‌ప్రైజ్ చేశారు. ఈ రొమాంటిక్ మూమెంట్‌కు సంబంధించిన వీడియోను పలాష్ స్వయంగా తన సోషల్ మీడియాలో షేర్ చేయడంతో, అది కాస్తా ఫ్యాన్స్ మధ్య తెగ వైరల్ అవుతోంది.పలాష్ షేర్ చేసిన వీడియో చాలా సినిమాటిక్‌గా ఉంది. వీడియో మొదట్లో స్మృతి మంధాన కళ్లకు గంతలు కట్టి, పలాష్ ఆమెను డీవై పాటిల్ స్టేడియం లోపలికి తీసుకొచ్చారు.
మరిన్ని వీడియోల కోసం :
బ్యాక్ బలంగా ఉండడం అవసరం..సమంత పోస్ట్ వైరల్ వీడియో
ప్లాన్ మార్చిన ఓటీటీ… నిర్మాతలకు నష్టాలు తప్పవా? వీడియో
బిగ్‌బాస్ నిర్వాహకులకు దెబ్బ మీద దెబ్బ వీడియో
సంక్రాంతి ముందు నాన్‌వెజ్ ప్రియులకు షాక్..
రాత్రివేళ నడిరోడ్డుపై వింత ఆకారం.. ఆగిపోయిన వాహనాలు
కత్తులతో నడిరోడ్డుపై రచ్చ చేసిన మహిళ..
రాకుమారుల రుమాలు.. రేటు జస్ట్.. రూ.7 లక్షలే
అర్ధరాత్రి పోలీసుల ముందే బైక్ స్టంట్స్.. వీడియో వైరల్
బిచ్చగాడు కాదు లక్షాధికారి.. చనిపోయాక బయటపడ్డ నిజం
ఆ కొండపై ఫోన్ చేస్తే.. చనిపోయిన వాళ్ళూ పలుకుతారా ??
