అన్నాచెల్లెళ్ల పెళ్లి !! ఎందుకు చేసుకున్నారో తెలుసా ??
ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సీఎం సామూహిక వివాహ పథకం ద్వారా వచ్చే ప్రయోజనాలను పొందేందుకు అన్నాచెల్లెళ్లు పెళ్లి చేసుకున్నారు. అయితే ఆ మహిళ భర్త ఫిర్యాదుతో అధికారులు దర్యాప్తు చేపట్టగా మొత్తం బండారం బయటపడింది. ప్రభుత్వం ఇచ్చిన కానుకలన్నింటినీ అధికారులు వెనక్కి తీసుకున్నారు. మహారాజ్గంజ్ జిల్లాలో ఈ ఘటన జరిగింది.
ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సీఎం సామూహిక వివాహ పథకం ద్వారా వచ్చే ప్రయోజనాలను పొందేందుకు అన్నాచెల్లెళ్లు పెళ్లి చేసుకున్నారు. అయితే ఆ మహిళ భర్త ఫిర్యాదుతో అధికారులు దర్యాప్తు చేపట్టగా మొత్తం బండారం బయటపడింది. ప్రభుత్వం ఇచ్చిన కానుకలన్నింటినీ అధికారులు వెనక్కి తీసుకున్నారు. మహారాజ్గంజ్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. జిల్లాలోని లక్ష్మీపుర్ బ్లాక్లో మార్చి 5వ తేదీన ముఖ్యమంత్రి సామూహిక వివాహ పథకం కింద 38 నిరుపేద కుటుంబాలకు చెందిన యువతులకు ఘనంగా పెళ్లి చేసింది యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం. అయితే ఆ రోజు ఓ యువతి పథకం ద్వారా వచ్చే సొమ్ము, కానుకల కోసం కక్కుర్తిపడి తన సోదరుడితో ఏడడుగులు నడిచింది. ఆమెకు ఏడాది క్రితమే వివాహం జరగ్గా, ప్రస్తుతం భర్త జీవనోపాధి కోసం వేరే ప్రాంతంలో ఉంటున్నాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Om Bheem Bush: ఓం భీమ్ బుష్ సినిమా ఎలా ఉందంటే ?? రివ్యూ మీరే చూసేయండి