Kashmir: క్రికెట్ బాల్‌తో చిరుత బారి నుంచి తన తమ్ముణ్ణి కాపాడిన 9 ఏళ్ల అన్న.
జమ్ముకశ్మీర్‌లోని బుద్గామ్‌లో ఓ 12 ఏళ్ల బాలుడు తన ధైర్యసాహసాలతో తన తమ్ముడిని చిరుతపులి బారి నుంచి ప్రాణాలతో కాపాడాడు. క్రికెట్ ఆడుతుండగా దూసుకొచ్చిన చిరుతను తన దగ్గర ఉన్న బాల్‌తో పారిపోయేలా చేశాడు. చిరుత కంటిపై గురిచూసి కొట్టి తన తమ్ముడిని కాపాడాడు. అసలేం జరిగిందంటే? నాలుగో తరగతి చదువుతున్న అకిబ్ జావేద్ తాజాగా తన ఇంటి సమీపంలో తన తమ్ముడితోపాటు మరికొందరు స్నేహితులతో క్రికెట్ ఆడుతున్నాడు.
జమ్ముకశ్మీర్‌లోని బుద్గామ్‌లో ఓ 12 ఏళ్ల బాలుడు తన ధైర్యసాహసాలతో తన తమ్ముడిని చిరుతపులి బారి నుంచి ప్రాణాలతో కాపాడాడు. క్రికెట్ ఆడుతుండగా దూసుకొచ్చిన చిరుతను తన దగ్గర ఉన్న బాల్‌తో పారిపోయేలా చేశాడు. చిరుత కంటిపై గురిచూసి కొట్టి తన తమ్ముడిని కాపాడాడు. అసలేం జరిగిందంటే? నాలుగో తరగతి చదువుతున్న అకిబ్ జావేద్ తాజాగా తన ఇంటి సమీపంలో తన తమ్ముడితోపాటు మరికొందరు స్నేహితులతో క్రికెట్ ఆడుతున్నాడు. ఆ సమయంలో ఒక్కసారిగా అకిబ్ తమ్ముడిపై చిరుతపులి దూసుకొచ్చింది. అది చూసిన అకిబ్ తన జేబులో ఉన్న క్రికెట్ బాల్‌ను చిరుతపులి కంటిపై విసిరాడు. తన తమ్ముడిపై ఉన్న చిరుత దృష్టిని మళ్లించాడు. ఆ తర్వాత అకిబ్ స్నేహితుడు ఇటుకను తీసుకొచ్చి చిరుతపైకి విసిరాడు. గట్టిగా చిరుత చిరుత అంటూ అరిచాడు. వెంటనే గ్రామస్థులంతా అక్కడికి చేరుకున్నారు. అంతా కలిపి చిరుతను చెదరగొట్టారు. బాలుడిని ఆస్పత్రికి తీసుకెళ్లడానికి ఎలాంటి సౌకర్యాలు లేకపోవడం వల్ల కొన్ని గంటల తర్వాత తీసుకెళ్లారు.
తాము ఆడుకుంటూ ఉండగా తమ ఇంటి సమీపంలో ఏదో జంతువు వస్తున్నట్లు అనిపించిందనీ వెంటనే చూడగా చిరుత తన తమ్ముడిపైకి దూసుకొచ్చిందని అకీబ్ తెలిపాడు. తన దగ్గర ఉన్న బాల్‌ను విసిరాననీ ఫ్రెండ్స్ కూడా సహాయం చేశారని చెప్పాడు. ఇటీవల తమ ఊర్లో ఓ బాలిక చిరుతపులి దాడిలో చనిపోయిన విషయం గుర్తొచ్చి భయమేసిందనీ అకిబ్ తెలిపాడు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.
ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.
ఫర్నిచర్ షాపులోకి చొచ్చుకెళ్లిన కారు..!
మర్రిచెట్టు తొర్రలో.. రూ.15 లక్షలు!
ఈ బుడ్డోడి లక్కే లక్కు.. రూ.200 తో రూ. 50 లక్షల కారు పట్టేసాడు
మహిళా డ్రైవర్ క్యాబ్‌లో ప్రయాణం.. యువతి కామెంట్ వైరల్!
అదృష్టం అంటే ఇతనిదే.. భూమిలో దొరికిన బంగారు నిధి!
వెయిటర్‌పై చేయి చేసుకున్న గెస్ట్.. కట్ చేస్తే
సందర్మాట్ కెనాల్ ఒడ్డున అరుదైన శ్వేతనాగు దర్శనం!

