అధిక బరువు(Weight)తో బాధపడుతోన్న ఓ వ్యక్తి సన్నగా ఫిట్(Fit)గా అవ్వాలనుకున్నాడు. డైట్(Diet) ట్రై చేశాడు. కానీ, మధ్యలోనే వదిలేశాడు. ఇక లాభం లేదని, జిమ్‌లో ట్రై చేద్దామనుకున్నాడు. ట్రైనర్‌ను కలిశాడు. అక్కడ కూడా బద్దకంతో తన వల్ల కాలేదు. కానీ, అక్కడే అతను తెలివిగా ఆలోచించాడు. కట్ చేస్తే.. కేవలం రెండు రోజుల్లోనే సిక్స్ ప్యా్క్‌తో దర్శనమిచ్చాడు. ఏంటి.. ఈ వార్త విని షాకవుతున్నారా.. అయితే, మీరు కచ్చితంగా అసలు ఏం జరిగిందో తెలుసుకోవాల్సిందే. ఈ వ్యక్తి చేసిన పనితో ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరలవుతోంది.
వర్కవుట్ చేయడం ఇష్టం లేని ఈ వ్యక్తి సిక్స్-ప్యాక్ అబ్స్ కోసం ఎలాంటి ప్లాన్ వేశాడో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. డీన్ గున్థర్ అనే టాటూ ఆర్టిస్ట్ ఈ వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నాడు. ఈమేరకు ఆయన మాట్లాడుతూ, ఒక కస్టమర్ టోన్డ్ పొట్టను కోరుకుంటున్నారని, సంవత్సరాలుగా జిమ్‌లో వ్యాయామం చేస్తున్నాడని చెప్పుకొచ్చాడు. కోరిన ఫలితం రాకపోవడంతో నన్ను ఆశ్రయించాడు. ఈమేరకు సదరు వ్యక్తి “2 రోజుల్లో 6 ప్యాక్” ఎలా పొందాలంటూ అడిగినట్లు తెలిపాడు. షాక్‌లో ఉన్న అతను తేరుకునేలోపే.. మీరు టాటూ వేయండి! సరిపోద్ది అంటూ కోరినట్లు పేర్కొన్నాడు.’జిమ్‌లో గంటలు గడిపి విసిగిపోయాను. కాబట్టి 6 ప్యాక్ టాటూ వేస్తే సంతోషంగా ఉంటాను’ అని అనడంతో ఆశ్చర్యపోయానని తెలిపాడు.
ప్రస్తుతం మాంచెస్టర్‌లో నివసిస్తున్న దక్షిణాఫ్రికాకు చెందిన ట్రావెలింగ్ టాటూ ఆర్టిస్ట్ గున్థర్, ఆ వ్యక్తి పొట్టపై ఆకట్టుకునేలా కనిపించే అబ్స్‌ల టాటూ వేశాడు. దీనికోసం ఆయన ఎలాంటి డబ్బులు కూడా తీసుకోలేదు. ఎందుకంటే ఇది ఓ ప్యాషన్ ప్రాజెక్ట్‌లా చేపట్టాడంట. దీంతో ఈ వ్యక్తి కేవలం రెండు రోజుల్లోనే ఇలాంటి టాటూతో దర్శనమిచ్చాడు. ఈమేరకు ఈ వీడియోను నెట్టింట్లో పంచుకోవడంతో తెగ వైరలవుతోంది. దీనిపై నెటిజన్లు కూడా తమ కామెంట్లను పంచుకుంటున్నారు. ‘అబ్బో ఇది నిజంగా అద్భుతమైన ఐడియాకు పరాకాష్ట’ అంటూ ఓ యూజర్ కామెంట్ చేయగా, ‘ ఇలాంటి ఐడియాతో సిక్స్ ప్యాక్ పొందాలని మాకు తెలియదు బ్రో’ అంటూ చెప్పుకొచ్చాడు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: Viral Video: కుడి ఎడమైతే పొరపాటే.. ఈ ఫన్నీ వీడియో పై ఓ లుక్ వేయండి మరి..
Watch Video: ఉత్కంఠగా మ్యాచ్.. ఇంతలో ఎంట్రీ ఇచ్చిన అనుకోని అతిథి.. ఆటగాళ్ల పరిస్థితి ఏంటో తెలుసా?