Man turned dog: ఇదేందయ్యా ఇది..! ఇదే ఆలోచన.. కుక్కలా మారిపోయిన మనిషి.. ఎందుకంటే..
అతనిది ఓ విచిత్రమైన కోరిక.. అతని లక్ష్యం, కల కూడా అదే.. అయితే లక్ష్యం సాధించాలంటే కలలు కంటే సరిపోదని దాన్ని ఎలాగైనా సాధించుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఇంతకీ అతని లక్ష్యం ఏంటో తెలుసా...
అతనిది ఓ విచిత్రమైన కోరిక.. అతని లక్ష్యం, కల కూడా అదే.. అయితే లక్ష్యం సాధించాలంటే కలలు కంటే సరిపోదని దాన్ని ఎలాగైనా సాధించుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఇంతకీ అతని లక్ష్యం ఏంటో తెలుసా… కుక్కలా బతకం… కోప్పడకండి.. ఇది నిజం.. అసలు విషయం ఏంటంటే.. జపాన్‌కు చెందిన టోకో అనే వ్యక్తికి ఎప్పట్నుంచో శునకంలా బతకాలని కల.. లక్ష్యం కూడా. దాన్ని నెరవేర్చుకోవడానికి సిద్ధమయ్యాడు. కుక్కంటే ఇష్టం కాబట్టి దాని బాడీ లాంగ్వేజ్ అంతా అలవర్చుకున్నాడు. మరి కుక్కలా కనిపించడం ఎలా? అది కూడా అచ్చం ఒరిజినల్‌లా కనిపించాలి. దీంతో ఓ స్పెషల్ ఎఫెక్ట్స్ కంపెనీ సంప్రదించాడు. విషయం చెప్పి.. ఆల్ట్రా రియలిస్టిక్ డాగ్ కాస్ట్యూమ్ తయారు చేయమని చెప్పాడు. వాళ్లు కూడా ఈ విషయాన్ని చాలెంజింగ్‌గా తీసుకుని. కుక్కల శరీర నిర్మాణ శైలిని అధ్యయనం చేశారు. 40 రోజుల్లో అస్సలు ఏమాత్రం అనుమానం రాని విధంగా ఈ కుక్క కాస్ట్యూమ్‌ను తయారు చేశారు. ఇందుకోసం 11 లక్షలు పైనే చార్జ్ చేశారు. ఇక అటు టోకో ఆనందానికి అంతే లేదు. ఈ దుస్తులు వేసుకుని.. తన యూట్యూబ్ చానల్‌లో ఓ వీడియోను పోస్టు చేశాడు. అలాగే ఫొటోస్‌ను ట్విట్టర్‌లో పంచుకున్నాడు. అంతే.. ఆ వీడియోలు స్థానిక టీవీల్లో టెలికాస్ట్ అయ్యాయి. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. అది చూసిన నెటిజన్లు కొందరు ‘కుక్కలా బతకాలన్న ఆశ ఏందిరా..!?’ అనుకుని ఆశ్చర్యపోతే.. మరికొందరు టోకో ఆశను అర్థం చేసుకుని.. ‘ఇతరులకు హాని కలగకుండా ఆయన జీవితాన్ని ఆయన బతుకుతున్నాడు.. మనకేం’ అంటూ కామెంట్ చేశారు. అయితే.. ఇప్పటికీ టోకో కుక్కలానే బతుకుతున్నాడా.. లేక కాస్ట్యూమ్ తీసేసి.. మనిషిలా మారాడా అన్న విషయం మాత్రం తెలియలేదు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Google Search: ఈ 3 విషయాలు గూగుల్‌లో సెర్చ్ చేయకండి.. చేస్తే జైలుకెళ్లడం కన్ఫమ్..!
Ratlam Temple: ఆ గుడికి వెళ్తే.. బంగారం ఫ్రీ..! భక్తులకు ప్రసాదంగా బంగారు, వెండి నాణాలు.. ఎక్కడంటే.?
Child cooking: ఈ బుడ్డోడు గరిటపడితే బాల భీముడే.. బుడతడి వంటకు నెటిజన్లు ఫిదా..!