ఓ అరుదైన జింకకు ప్రాణం పోసారు మణిపురి గ్రామస్తులు. ఆకస్మిక వరదల నుంచి తప్పించుకునే క్రమంలో అరుదైన సంగై జాతికి చెందిన ఓ జింక మణిపూర్ రాష్ట్రంలోని మణిపురి గ్రామంలోకి వచ్చింది. ఆహారం దొరక్క నీరసించిపోయి వణుకుతూ సొమ్మసిల్లిపోయింది. ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటున్న జింకను చూసి గ్రామస్తులు చలించిపోయారు. దానికి సపర్యలు చేసి, ప్రాణాలు కాపాడారు. దానికి చికిత్స చేశారు. అనంతరం అటవీశాఖ అధికారులు దాన్ని సమీపంలోని అడవుల్లో విడిచిపెట్టారు. ఈ వీడియోను అటవీ, పర్యావరణం, వాతావరణ మార్పుల రాష్ట్ర మంత్రి తొంగమ్ బిశ్వజిత్ సింగ్ ఆన్‌లైన్‌లో షేర్ చేశారు. హృదయాన్ని కదిలించే ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Google Search: ఈ 3 విషయాలు గూగుల్‌లో సెర్చ్ చేయకండి.. చేస్తే జైలుకెళ్లడం కన్ఫమ్..!
Ratlam Temple: ఆ గుడికి వెళ్తే.. బంగారం ఫ్రీ..! భక్తులకు ప్రసాదంగా బంగారు, వెండి నాణాలు.. ఎక్కడంటే.?
Child cooking: ఈ బుడ్డోడు గరిటపడితే బాల భీముడే.. బుడతడి వంటకు నెటిజన్లు ఫిదా..!