కాంటాక్ట్‌ లెన్స్‌ తీయకుండా పడకున్నాడు.. తెల్లారేసరికి కన్ను !!

కాంటాక్ట్‌ లెన్స్‌ తీయకుండా పడకున్నాడు.. తెల్లారేసరికి కన్ను !!

Phani CH

|

Updated on: Feb 25, 2023 | 10:00 AM

కంటిచూపు మందగించినప్పుడు కళ్లద్దాలు వాడటం సహజం. అయితే కళ్లద్దాల స్థానంలో కొందరు కాంటాక్ట్‌ లెన్స్‌ను ఉపయోగిస్తుంటారు. ఇటీవల వీటి వాడకం బాగా పెరిగింది.

కంటిచూపు మందగించినప్పుడు కళ్లద్దాలు వాడటం సహజం. అయితే కళ్లద్దాల స్థానంలో కొందరు కాంటాక్ట్‌ లెన్స్‌ను ఉపయోగిస్తుంటారు. ఇటీవల వీటి వాడకం బాగా పెరిగింది. అయితే వాటిని వినియోగించడంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే కంటిచూపునే కోల్పోయే ప్రమాదముంది. అందుకు ఉదాహరణే ఈ ఘటన. కాంటాక్ట్ లెన్స్‌ ఉపయోగించినప్పుడు వాటిని రాత్రి పడుకోబోయేముందు తీసేయాలని నిపుణులు సైతం చెబుతుంటారు. అమెరికాలో ఫ్లోరిడాకు చెందిన మైక్ క్రుమోల్జ్ అనే వ్యక్తి గత ఏడేళ్లుగా కాంటాక్టు లెన్సులు వాడుతున్నాడు. అప్పుడప్పుడూ అతను కాంటాక్టు లెన్సులు తీయడం మర్చిపోయి అలాగే నిద్రపోయేవాడు. ఈ క్రమంలో అతనికి కళ్లు ఎర్రబారడం, మంటపుట్టడం జరిగేది. మొదట్లో అతను దానిని లైట్‌ తీసుకున్నాడు. అయితే ఎప్పట్లాగానే ఒకరోజున కాంటాక్ట్ లెన్సులు తీయకుండానే నిద్రపోయాడు. మరుసటి రోజు కుడికంటిలో అతనికి తీవ్ర అసౌకర్యంగా అనిపించి ఆసుపత్రికి వెళ్లాడు. వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు.. మాంసాహారం తినే పరాన్నజీవులు అతడి కంటిని తినేశాయని వెల్లడించారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Monkey: ఈ కోతి గిన్నెలు కడిగితే తళతళ మెరవాల్సిందే !!

అమరనాథ్ కంటే పెద్ద మంచు శివలింగం.. ఎక్కడుందో తెలుసా ??

Almond: 12 రోజుల పాటు బాదం తింటే ఈ వ్యాధి దూరం

Ram Charan: అలా కోరిక బయటపెట్టాడో లేదో.. ఇలా హాలీవుడ్ ఛాన్స్‌

Pathaan: చరిత్ర సృష్టించిన షారుఖ్.. మొత్తానికి 1000కోట్ల రికార్డ్ !!

 

 

Published on: Feb 25, 2023 10:00 AM