Almond: 12 రోజుల పాటు బాదం తింటే ఈ వ్యాధి దూరం

అధికబరువు..డయాబెటిస్‌.. ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న ఈ రెండు అతిపెద్ద సమస్యలకు శాశ్వత పరిష్కారమంటూ లేవు. అంతేకాదు ఈ రెండు సమస్యలు ఒకదానికొకటి లింకై ఉంటాయి.

Almond: 12 రోజుల పాటు బాదం తింటే ఈ వ్యాధి దూరం

|

Updated on: Feb 25, 2023 | 9:56 AM

అధికబరువు..డయాబెటిస్‌.. ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న ఈ రెండు అతిపెద్ద సమస్యలకు శాశ్వత పరిష్కారమంటూ లేవు. అంతేకాదు ఈ రెండు సమస్యలు ఒకదానికొకటి లింకై ఉంటాయి. అధికబరువు ఉన్న వారికి మధుమేహ ముప్పు కూడా ఉంటుందనేది అందరికీ తెలిసిన సత్యం. ఆహారాన్ని నియంత్రించడం.. క్రమం తప్పని వ్యాయామం ద్వారా వీటిని నియంత్రణలో ఉంచుకోవచ్చు. ఈ రెండు సమస్యలపై ఏళ్లుగా జరుగుతున్న పరిశోధనలు కూడా ఇవే చెబుతున్నాయి. తాజాగా చెన్నైలోని మద్రాసు మధుమేహ పరిశోధన సంస్థకు చెందిన పరిశోధకుల నేతృత్వంలో 26-65 ఏళ్ల మధ్య వయసున్న 400 మందిపై జరిగిన అధ్యయనంలో మరో కొత్త విషయం వెల్లడైంది. వరుసగా 12 రోజులపాటు క్రమం తప్పకుండా బాదంలను తింటే క్లోమం పనితీరు మెరుగుపడుతుందని తేలింది. ఫలితంగా ఇన్సులిన్ నిరోధకత తగ్గుతుంది. రక్తంలో చక్కెర నిల్వల నియంత్రణ మెరుగవుతుంది. అలాగే బీఎంఐ ఇండెక్స్‌లోనూ తగ్గుదల కనిపిస్తుంది. అలాగే ఊబకాయంతో బాధపడుతున్న వారిలో డయాబెటిస్ ముప్పు తగ్గుతుందని ఈ పరిశోధనలో తేలింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Ram Charan: అలా కోరిక బయటపెట్టాడో లేదో.. ఇలా హాలీవుడ్ ఛాన్స్‌

Pathaan: చరిత్ర సృష్టించిన షారుఖ్.. మొత్తానికి 1000కోట్ల రికార్డ్ !!

జోరు జోరుగా సాగుతున్న కలెక్షన్ల హోరు.. 100కోట్ల వైపుగా సార్ !!

Ram Charan: ఇష్టమొచ్చినట్టు చెర్రీని తిట్టకండి !! నిజం తెలుసుకోండి !!

హలీవుడ్ బెస్ట్ హీరో.. అవార్డు గెలిచేదెవరు ??

 

Follow us