AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Funny Magic Trick: వీడు మామూలోడు కాదు.. పోలీసులకే మస్కా కొట్టాడు.. కట్ చేస్తే నవ్వులే నవ్వులు..!

Funny Magic Trick: వీడు మామూలోడు కాదు.. పోలీసులకే మస్కా కొట్టాడు.. కట్ చేస్తే నవ్వులే నవ్వులు..!

Anil kumar poka
|

Updated on: Apr 05, 2022 | 8:59 AM

Share

మ్యాజిక్ అంటే ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు చెప్పండి. భారతీయులు ఇంద్రజాలంగా పిలుచుకునే ఈ వినూత్న కళకు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ప్రాముఖ్యత ఉంది. దేశీయ గారడీ విధ్యలకు జనాలు ఫిదా అయిపోతుంటారు. విదేశాల్లోనూ ఇలాంటి మ్యాజిక్స్



మ్యాజిక్ అంటే ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు చెప్పండి. భారతీయులు ఇంద్రజాలంగా పిలుచుకునే ఈ వినూత్న కళకు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ప్రాముఖ్యత ఉంది. దేశీయ గారడీ విధ్యలకు జనాలు ఫిదా అయిపోతుంటారు. విదేశాల్లోనూ ఇలాంటి మ్యాజిక్స్ టీవీ షోల్లో మనం చూస్తూనే ఉంటాం. తమ మ్యాజిక్‌తో వింతలు సృష్టిస్తారు. అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తారు ఇంద్రజాలకులు(మెజీషియన్స్). స్కూళ్లు, కాలేజీలలో, వివిధ వేదికలపై మ్యాజీక్ షో లు నిర్వహిస్తూ ప్రజలను అలరిస్తుంటారు.అయితే, ఈ మధ్య కాలంలో రోడ్లపైన మ్యాజిక్ ప్రదర్శించడం ట్రెండీగా మారింది. రద్దీ ప్రదేశాల్లో చిన్న చిన్న మ్యాజిక్స్ చేసి ప్రజలను అకట్టుకుంటున్నారు. ఇలాంటి విధానాలు ముఖ్యంగా పాశ్చాత్య దేశాల్లో ఎక్కువగా ఉంది. తాజాగా ఇలాంటి మ్యాజిక్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మెజీషియన్ వేషం వేసిన ఓ వ్యక్తి.. రోడ్డుపై మ్యాజిక్ చేస్తూ అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇంతలో రోడ్డుపై పోలీస్ వాహనం నిలిపి ఉండగా.. అక్కడికి వెళ్లాడు. పోలీసుల ముందు విన్యాసం చేసే ప్రయత్నం చేశాడు. ఒక క్లాత్‌ను వారికి చూపిస్తూ అటూ ఇటూ షేక్ చేశాడు. ఆ తరువాత క్లాత్‌ను వదలేసి.. అతను కారు కిందకు వంగాడు. అలా మోకాళ్లపై పాకుతూ.. కారుకు అవతలివైపు వెళ్లాడు. అంటే.. ఇక్కడ మాయమై.. అక్కడ ప్రత్యక్షమైనట్లు బిల్డప్ ఇవ్వబోయాడన్న మాట. ఈ ఫన్నీ స్కిట్‌ను చూసిన అక్కడి ప్రజలు కడుపుబ్బా నవ్వుకున్నారు. ఇక పోలీసులను ఫూల్స్ చేసేందుకు అతను చేసిన ప్రయత్నాన్ని.. కొందరు తమ కెమెరాల్లో రికార్డ్ చేశారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అదికాస్తా వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూసి నెటిజన్లు ఫుల్లుగా నవ్వుకుంటున్నారు.

మరిన్ని చూడండి ఇక్కడ:
Dog singing Video: వావ్ వాట్ ఏ సింగింగ్ రెయ్.. పియానో వాయిస్తూ పాటపాడిన శునకం.. ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే..

Raashi Khanna shocking: అలాంటి పనులకే హీరోయిన్ కావాలా…రాశీ ఖన్నా షాకింగ్ కామెంట్స్‌..

అయ్యాయో పాపం.. అమ్మాయి ముందు పరువు పాయే..! మైకేల్‌ జాక్సన్‌ స్టెప్‌ వేద్దామనుకున్నాడు సీన్ రివర్స్‌…

Viral Video: అయ్యా..! చూస్తుండగానే ఒక్కసారిగా కుప్పకూలిన 200 మంది.. వీడియో చుస్తే షాక్ అవుతారు..

Funny Video: చిన్న పిల్లలా ఎంజాయ్‌ చేద్దామనుకుంటే సీన్‌ రివర్స్‌ అయిందిగా…! నవ్వులు పూయిస్తున్న వీడియో…

Wedding Viral Video: లవ్లీ సర్ ప్రైజ్ ఇచ్చిన వరుడు..నవ వధువు ఫిదా! ఈ వీడియోకు లైకుల వర్షం..

Viral Video: పాములు ఇలా కూడా పగ పడతాయా..? ఏడు నెలల్లో మూడు సార్లు కాటు.. యువతిని వెంటాడిన పాము

Follow Us