AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: వీడెవడండి బాబు.. స్పైడర్‌మ్యాన్‌కే బాబులా ఉన్నాడు.. 61 అంతస్తుల భవనాన్ని అలవోకగా..

Viral Video: నలుగురు నడిచే దారిలో వెళ్లకుండా తమకంటూ ఓ ప్రత్యేకత ఉండాలని కోరుకుంటారు కొందరు. ఇందుకోసం ఎంతటి రిస్క్‌ అయినా చేస్తుంటారు. చివరికి ప్రాణాలను సైతం పణంగా పెట్టి మరీ, అందరి దృష్టిని ఆకర్షించాలని ప్రయత్నిస్తుంటారు...

Viral Video: వీడెవడండి బాబు.. స్పైడర్‌మ్యాన్‌కే బాబులా ఉన్నాడు.. 61 అంతస్తుల భవనాన్ని అలవోకగా..
Viral Video
Narender Vaitla
|

Updated on: May 04, 2022 | 10:05 AM

Share

Viral Video: నలుగురు నడిచే దారిలో వెళ్లకుండా తమకంటూ ఓ ప్రత్యేకత ఉండాలని కోరుకుంటారు కొందరు. ఇందుకోసం ఎంతటి రిస్క్‌ అయినా చేస్తుంటారు. చివరికి ప్రాణాలను సైతం పణంగా పెట్టి మరీ, అందరి దృష్టిని ఆకర్షించాలని ప్రయత్నిస్తుంటారు. తాజాగా అమెరికాకు చెందిన ఓ యువకుడి ఇలాంటి పని చేసి అందరినీ షాక్‌కి గురి చేశాడు. అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో నగరంలో సేల్స్‌ ఫోర్స్‌ కంపెనీకి చెందిన ఓ భారీ టవర్‌ ఉంది. ఈ బిల్డింగ్‌ను మొత్తం 61 ఫోర్లతో నిర్మించారు. తాజాగా ఓ గుర్తు తెలియని వ్యక్తి ఆ భారీ టవర్‌ను ఎక్కి ఆశ్చర్యపరిచాడు.

మొదట అతడిని ఎవరు గుర్తించకపోయినప్పటికీ.. తర్వాత ఆఫీసు లోపల ఉన్న వారు చూసి దిగమని వారించారు. అయినా మొండిగా పైకి ఎక్కాడు సదరు వ్యక్తి. దీనంతిటినీ అక్కడి ఉద్యోగులు, భవనం వెలుపల ఉన్న ప్రజలు తమ కెమెరాల్లో బంధించి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. దీంతో ఈ వీడియో కాస్త నెట్టింట తెగ సందడి చేస్తోంది. ఇక అదే మొండి పట్టుతో అతను చివరికి బిల్లిండి పై అంతస్తు వరకు క్షేమంగా చేరుకున్నాడు. అయితే ఈ ఫీట్‌ సాధించినందుకు అతన్ని సన్మానించారు అనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఎలాంటి అనుమతులు లేకుండా సాహసానికి ఒడిగట్టడాన్ని నేరంగా భావించిన పోలీసులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం క్లిక్ చేయండి..

Also Read: World Asthma Day 2022: ఆస్తమా రోగులు పొరపాటున కూడా వీటిని తినకూడదు.. మర్చిపోతే ఇక అంతే సంగతులు..

Tamil Nadu: ఉద్యోగులు కంపెనీ వీడకుండా పెళ్లిళ్లు కుదురుస్తున్న ఐటీ కంపెనీ.. ఎక్కడో తెలుసా..

సేమ్ టు సేమ్.. ఒకే స్టైల్ గడ్డంతో అదరగొడుతోన్న ప్రధాని మోదీ.. విరాట్ కోహ్లీ..