నిజంగానే అది మహారాజా రైలు అందుకే టికెట్‌ ధర 19 లక్షలు

నిజంగానే అది మహారాజా రైలు అందుకే టికెట్‌ ధర 19 లక్షలు

Phani CH

|

Updated on: Dec 23, 2022 | 9:39 PM

ట్రైన్‌లో కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు ప్రయాణించడానికి మహా అయితే పది వేలు అవుతుందేమో! అంత కూడా కాదేమో! అందుకే చాలా మంది ట్రైన్లను ప్రిఫర్‌ చేస్తారు. దూర ప్రయాణానికి రైలంత సుఖం లేదు.

ట్రైన్‌లో కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు ప్రయాణించడానికి మహా అయితే పది వేలు అవుతుందేమో! అంత కూడా కాదేమో! అందుకే చాలా మంది ట్రైన్లను ప్రిఫర్‌ చేస్తారు. దూర ప్రయాణానికి రైలంత సుఖం లేదు. కానీ మహారాజా ఎక్స్‌ప్రెస్‌ రైలులో ప్రయాణిస్తే మాత్రం తడిసి మోపడవుతుంది. ఎందుకంటే అందులో టికెట్‌ రేటు 19 లక్షల రూపాయలట! గుండె గుబేలు మంది కదూ! ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో నడుస్తున్న మహారాజాస్ ఎక్స్‌ప్రెస్‌ వివిధ మార్గాల్లో ప్రయాణికులకు లగ్జరీ రైలు ప్రయాణ అనుభూతిని అందిస్తోంది. 19 లక్షలు పెట్టినందుకు బోల్డన్ని సదుపాయలను కలిగిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే అదో చిన్నపాటి లగ్జరీ హౌస్‌ అనుకోండి. ఒక కోచ్‌ మొత్తాన్ని ఓ అందమైన ఇల్లులా తీర్చి దిద్దారు. అన్ని వసతులు కల్పించారు. రెండు బెడ్‌రూమ్‌లు, లివింగ్‌ ఏరియా, వాష్‌రూమ్స్‌, టీవీ అబ్బో.. ఇంకా చాలా సదుపాయాలున్నాయి. ఇందులో ఉంటే మనం మన సొంత ఇంట్లో ఉన్న ఫీలింగ్‌ కలుగుతుంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

య‌జ‌మాని ముఖాన్ని పీక్కుతిన్న కొండ‌చిలువ‌.. షాకింగ్‌ వీడియో

వ్యక్తిని కిడ్నాప్‌ చేసి.. అతడి పెంపుడు కుక్కను డిమాండ్‌ చేసిన దుండగులు

అంకుల్ డ్యాన్స్ .. పెర్ఫామెన్స్ అదిరిందిగా అంటున్న నెటిజన్స్

రెండేళ్ల కుమారుడిని బాల్కనీ నుంచి కిందకు తోసేసి ??

భార్య మేకప్‌.. భర్త ఎలా సహకరించాడంటే !! నెట్టింట వీడియో వైరల్

 

 

Published on: Dec 23, 2022 09:39 PM