స్కూలు వార్షికోత్సవాల్లో అపశ్రుతి.. విద్యార్థి మెడలోంచి దూసుకెళ్ళిన జావెలిన్ !!
స్కూల్లో వార్షికోత్సవాల సందర్భంగా విద్యార్ధులు రకరకాల క్రీడలకు సంబంధించి ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ క్రమంలో జావెలిన్ త్రో ప్రాక్టీస్ చేస్తుండగా ప్రమాదవశాత్తు జావెలిన్ విద్యార్ధి మెడలోంచి దూసుకుపోయింది.
స్కూల్లో వార్షికోత్సవాల సందర్భంగా విద్యార్ధులు రకరకాల క్రీడలకు సంబంధించి ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ క్రమంలో జావెలిన్ త్రో ప్రాక్టీస్ చేస్తుండగా ప్రమాదవశాత్తు జావెలిన్ విద్యార్ధి మెడలోంచి దూసుకుపోయింది. ఈ ఘటన ఒడిశాలోని బలంగీర్ జిల్లాలో ని ప్రభుత్వ పాఠశాలలో చోటుచేసుకుంది. ఓ వైపు స్కూల్లో స్పోర్ట్స్ మీట్ జరుగుతోంది. మరోవైపు విద్యార్ధులు క్రీడలకు సంబంధించి వార్షికోత్సవాల సందర్భంగా క్రీడలు ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ క్రమంలో హైస్కూల్లో ఓ విద్యార్ధి జావెలిన్ త్రో ప్రాక్టీస్ చేస్తుండగా ప్రమాదవశాత్తు అది 9వ తరగతి చదువుతున్న సదానంద మెహర్ అనే విద్యార్ధి మెలోంచి దూసుకెళ్లింది. మెహర్ మెడ కుడివైపునుంచి దూసుకెళ్లిన జావెలిన్ ఎడమవైపు వచ్చేసింది. దాంతో బాలుడిని వెంటనే బలంగీర్‌లోని భీమా భోయ్ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు విద్యార్ధి మెనుంచి జావెలిన్‌ను జాగ్రత్తగా తొలగించి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు.