బస్టాండ్‌లో బ్యాగ్‌తో అనుమానాస్పదంగా యోగా ట్రైనర్.. చెక్ చేయగా..
అతనో యోగా ట్రైనర్. అది అతని వృత్తి. ఇది పై పై కలరింగ్ జాబే. ఇతడి అసలు వ్యాపారం వేరే ఉంది. మత్తును గట్టు దాటించడంలో ఇతనికి ఇతనే సాటి.
అతనో యోగా ట్రైనర్. అది అతని వృత్తి. ఇది పై పై కలరింగ్ జాబే. ఇతడి అసలు వ్యాపారం వేరే ఉంది. మత్తును గట్టు దాటించడంలో ఇతనికి ఇతనే సాటి. కానీ ఇతని తెరవెనుక వ్యాపారం పట్టుతప్పి పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. చెన్నైలో ఓ యోగా ట్రైనర్ గంజాయిని స్మగ్లింగ్ చేస్తూ పోలీసులకు చిక్కాడు. అతని వద్ద నుంచి 10 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పెరుంగళత్తూరులో డిసెంబర్ 16న ఈ ఘటన జరిగింది. కేరళకు చెందిన దినేశ్.. పెద్ద బ్యాగ్‌తో అక్కడక్కడే తిరుగుతుండటతో అనుమానం వచ్చిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అతని బ్యాగ్ తనిఖీ చేయగా దినేష్ గంజాయి దందా బయటపడింది. దినేశ్ యోగాలో ఎక్స్‌పర్ట్. అందులో పీజీ కూడా కంప్లీట్ చేశాడు. ప్రజంట్ పాలవక్కాంలో ఉంటూ నీలంగరై, వేలచేరి, దురైపాకంలోని జిమ్‌లలో యోగా ట్రైనర్‌గా వర్క్ చేస్తున్నాడు. అతడి వద్ద యోగా ట్రైనింగ్ తీసుకుంటున్న వారిలో ఎక్కువ మంది ఐటీ ఉద్యోగులే.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
స్కూలు వార్షికోత్సవాల్లో అపశ్రుతి.. విద్యార్థి మెడలోంచి దూసుకెళ్ళిన జావెలిన్ !!