ఏడేళ్లుగా ఒంటికాలిపై సాధువు !! అన్న పానీయాలు, నిద్రా ఆ భంగిమలోనే

Updated on: Jan 10, 2026 | 9:30 AM

ప్రయాగ్‌రాజ్ మాఘమేళా జనవరి 3న మొదలై ఫిబ్రవరి 15 వరకు జరుగుతుంది. లక్షలాది భక్తులు గంగా నదిలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఈ మాఘమేళాలో 26 ఏళ్ల శంకర్‌పురి సాధువు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. బిహార్‌కు చెందిన ఈయన ఏడేళ్లుగా ఒంటికాలిపైనే జీవిస్తూ, నిలబడి అన్ని పనులు చేస్తూ అద్భుత తపస్సు చేస్తున్నారు.

ప్రయాగ్‌రాజ్‌లో మొదలైన 44 రోజుల మాఘమేళాలో భక్తులు గంగా నదిలో పుణ్యస్నానాలు చేస్తున్నారు. జనవరి 3న మొదలైన మాఘమేళా ఫిబ్రవరి 15 వరకు కొనసాగనుంది. లక్షల్లో సందర్శకులు తరలివచ్చి పవిత్ర గంగా నదీ సంగమంలో పుణ్యస్నానాలు ఆచరిస్తారని ఉత్తర్‌ప్రదేశ్‌ అధికారులు అంచనా వేస్తున్నారు. మాఘమేళాకు తరలివచ్చిన సాధువులలో ఓ 26 ఏళ్ల సాధువు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. అతను ఏడేళ్లుగా ఒంటికాలిపైనే తన జీవనాన్ని కొనసాగిస్తున్నారు. బిహార్‌లోని సీతామఢీ ప్రాంతానికి చెందిన శంకర్‌పురి గత ఏడేళ్లలో ఒక్కసారి కూడా పడుకోవడం, కూర్చోవడం వంటివి చేయలేదని చెబుతున్నారు. తను నైమిశారణ్య ప్రాంతంలో జన్మించాననీ అక్కడ దాదాపు 88వేల మంది సాధువులంటారనీ 6 ఏళ్ల వయసులోనే సన్యాసం స్వీకరించినట్లు తెలిపారు. ఆ ప్రాంతంలోనే తనకు ఓ ఆలోచన వచ్చిందనీ ఇకపై ఎప్పుడూ నిల్చొనే ఉండాలనుకున్నాననీ అన్నం తినడం, మంచి నీళ్లు తాగడంతోపాటు అన్ని పనులనూ నిల్చునే చేస్తాననీ అన్నారు. చెక్కతో చేసిన ఊయలలాంటి దానిపై తలను ఆనించి నిలుచునే నిద్రపోతాను అని శంకర్‌పురి వివరించారు. ఈ సాధువును చూసి భక్తులు ఆశ్చర్యంతో నోరెళ్లబెడుతున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

‘ఆధార్‌’ అక్రమాలకు అడ్డుకట్ట.. కొత్త డిజిటల్ యాప్ వచ్చేసింది

అర్ధరాత్రి బాల్కనీలో చిక్కుకుపోయిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే..

సంక్రాంతికి లగ్జరీ కారవాన్‌లో జాలీ ట్రిప్.. ఏపీ టూరిజం స్పెషల్ ప్యాకేజీ రెడీ

రోబోలకు నొప్పి తెలుస్తుంది.. సైంటిస్టుల ప్రయోగం సక్సెస్‌

హైదరాబాద్‌ వాసులకు బిగ్ అలర్ట్.. 37శాతం డేంజర్ జోన్‌లోనే