Underwater Kiss: నీటి అడుగున లాంగ్‌ కిస్‌.. గిన్నిస్‌ రికార్డ్‌కెక్కిన ప్రేమికులు.. ట్రేండింగ్ వీడియో..

Underwater Kiss: నీటి అడుగున లాంగ్‌ కిస్‌.. గిన్నిస్‌ రికార్డ్‌కెక్కిన ప్రేమికులు.. ట్రేండింగ్ వీడియో..

Anil kumar poka

|

Updated on: Feb 24, 2023 | 9:31 AM

ప్రతి ఏటా ప్రేమికుల రోజుకోసం ప్రేమికులు ఎంతగానో ఎదురు చూస్తారు. తమ పార్ట్‌నర్‌కి మరిచిపోలేని బహుమతులు ఇవ్వాలని, తన అమూల్యమైన ప్రేమను సరికొత్తగా వ్యక్తంగా చేయాలని తపిస్తారు.

ప్రతి ఏటా ప్రేమికుల రోజుకోసం ప్రేమికులు ఎంతగానో ఎదురు చూస్తారు. తమ పార్ట్‌నర్‌కి మరిచిపోలేని బహుమతులు ఇవ్వాలని, తన అమూల్యమైన ప్రేమను సరికొత్తగా వ్యక్తంగా చేయాలని తపిస్తారు. తాజాగా ఓ జంట కూడా అలాంటి ఆలోచనే చేసింది. ఈసారి వాలెంటైన్స్‌ డేను అసాధారణంగా జరుపుకోవాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నట్లుగానే వాలెంటైన్స్‌ డే జరుపుకుని ప్రపంచవ్యాప్తంగా వార్తల్లో నిలిచారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.దక్షిణాఫ్రికాకు చెందిన బెత్‌ నీల్‌, కెనడాకు చెందిన మైల్స్‌ క్లౌటియర్‌ ప్రేమికులు. ప్రస్తుతం ఇద్దరూ దక్షిణాఫ్రికాలో ఉంటున్నారు. ఈ క్రమంలో వాలెంటైన్స్‌ డే రోజున నీటి అడుగున నిలిచి ఎక్కువసేపు ముద్దు పెట్టుకుని గిన్నిస్‌ రికార్డు సృష్టించాలని వారు నిర్ణయించుకున్నారు. అందుకోసం గత కొన్ని వారాల నుంచి మాల్దీవ్స్‌లో మంచి ప్రాక్టీస్‌ కూడా చేశారు. ఇక ప్రేమికుల రోజు రానే వచ్చింది.. మాల్దీవ్స్‌లోనే వారి కల నెరవేర్చుకున్నారు. అందమైన నీలిరంగు దుస్తులు ధరించి, ఓ పూల్‌ అడుగు భాగంలో మోకాళ్లపై కూర్చుని ఏకంగా 4 నిమిషాల 6 సెకన్‌ల పాటు ముద్దు పెట్టుకున్నారు. నీటి అడుగున 4 నిమిషాలకుపైగా ఊపిరి బిగబట్టి ముద్దు పెట్టుకోవడం అంటే మాటలా మరి.. అందుకే ఇప్పటివరకు 3 నిమిషాల 24 సెకన్‌లుగా ఉన్న లాంగ్‌ కిస్‌ గిన్నిస్‌ రికార్డు బద్ధలైంది. ఈ రికార్డు బ్రేకింగ్‌ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ సంస్థ ఈ వీడియోను తన అధికారిక ఇన్‌స్టా హ్యాండిల్లో పోస్ట్‌ చేయడంతో నెటిజన్లు లైకులతో ముంచెత్తుతున్నారు. రకరకాలుగా కామెంట్‌లు చేస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Rana: నీనవ్వు నన్ను మళ్ళీ నీ ప్రేమలో పడేలా చేస్తుంది.. రానా భార్య.

Fact Video: లేడీస్ బి అలెర్ట్..! పొంచి ఉన్న ప్రమాదం.. విషపూరితమైన మేకప్ గురించి విన్నారా..?

Taraka Ratna: తారకరత్నని చూడటానికి వచ్చిన మతిస్థిమితం లేని వ్యక్తి.. బాలయ్యకు ఏదో చెప్తూ..

Published on: Feb 24, 2023 09:31 AM