Rana: నీనవ్వు నన్ను మళ్ళీ నీ ప్రేమలో పడేలా చేస్తుంది.. రానా భార్య.
ఫిబ్రవరి 14 అంతర్జాతీయ ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ప్రేమికులు ఒకరిపై ఒకరు తమకున్న ప్రేమను వ్యక్తం చేసుకుంటారు. ఫిబ్రవరి నెలలో వారం రోజుల పాటు రకరకాలుగా తమ ప్రేమను వ్యక్తం చేస్తూ సెలబ్రేట్ చేసుకుంటారు.
ఫిబ్రవరి 14 అంతర్జాతీయ ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ప్రేమికులు ఒకరిపై ఒకరు తమకున్న ప్రేమను వ్యక్తం చేసుకుంటారు. ఫిబ్రవరి నెలలో వారం రోజుల పాటు రకరకాలుగా తమ ప్రేమను వ్యక్తం చేస్తూ సెలబ్రేట్ చేసుకుంటారు. కేవలం ప్రేమికులు మాత్రమే కాదు, ప్రేమ వివాహం చేసుకున్న దంపతులు కూడా తమ పార్ట్‌నర్‌పై ప్రత్యేకంగా తమ ప్రేమను వ్యక్తం చేస్తూ.. ఈ ప్రేమ ఇలాగే కొనసాగుతుందని సంకేతమిస్తారు. ఇందుకు సెలబ్రిటీలు కూడా మినహాయింపు కాదు. ఈ క్రమంలో ప్రేమికుల రోజు సందర్భంగా భర్త, సినీ నటుడు రానాను ఉద్దేశించి ఆయన భార్య మిహీకా బజాజ్ భావోద్వేగంతో కూడిన పోస్ట్ చేశారు. తన కలల మనిషికి ప్రేమికుల రోజు శుభాకాంక్షలు అని ఆమె ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టారు. ‘స్ట్రాంగ్, స్వీట్, అందం, అద్భుతం ఇలా నీ గురించి చెప్పుకుంటూ పోవడానికి పదాలు చాలడం లేదు. నీవు నన్ను ఎంతో ప్రేమించడంలో ఆశ్చర్యం లేదు. సరదాగా అంటున్నా… నీ పనుల నిమిత్తం నీవు నాకు చాలా రోజులు దూరంగా ఉంటూ నన్ను బాధ పెట్టొచ్చు. కానీ నీ ఆ నవ్వు నన్ను మళ్లీ నీతో ప్రేమలో పడేలా చేస్తుంది. హ్యాపీ వాలెంటైన్స్ డే’ అంటూ ఎంతో భావోద్వేగంతో తన ప్రేమను వ్యక్తం చేశారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Wife – Husband: భర్త నాలుకను కరకర కొరికేసిన భార్య.. ఎందుకో తెలుసా.. ట్రెండ్ అవుతున్న వీడియో.
Motehr and Son: నువ్వు సూపర్ బ్రో.. కొడుకంటే నీలా ఉండాలి..! అమ్మ తన ఆఫీస్ చూడాలని..
కత్తులతో నడిరోడ్డుపై రచ్చ చేసిన మహిళ..
రాకుమారుల రుమాలు.. రేటు జస్ట్.. రూ.7 లక్షలే
అర్ధరాత్రి పోలీసుల ముందే బైక్ స్టంట్స్.. వీడియో వైరల్
బిచ్చగాడు కాదు లక్షాధికారి.. చనిపోయాక బయటపడ్డ నిజం
ఆ కొండపై ఫోన్ చేస్తే.. చనిపోయిన వాళ్ళూ పలుకుతారా ??
వాట్సాప్లో హాయ్ అంటే.. FIR కాపీ ఓయ్ అంటుంది
సంక్రాంతికి పల్లెబాట పట్టిన జనం

