Little girl: ఈ మాత్రం సంస్కారం ఉంటే.. ఏ అత్త అయినా కరిగిపోవాల్సిందే.. ట్రెండ్ అవుతున్న వీడియో.
చిన్న పిల్లలకు సంబంధించిన వీడియోలను చూడడానికి అందరూ ఇష్టపడతారు. వారు తెలిసీ తెలియక చేసే పనులు మనల్ని ఎంతగానో నవ్విస్తాయి.తాజాగా ఓ చిన్నారి
చిన్న పిల్లలకు సంబంధించిన వీడియోలను చూడడానికి అందరూ ఇష్టపడతారు. వారు తెలిసీ తెలియక చేసే పనులు మనల్ని ఎంతగానో నవ్విస్తాయి.తాజాగా ఓ చిన్నారి తెలిసీ తెలియక చేసిన పని నెటిజన్లను తెగ నవ్విస్తోంది. సాధారణంగా కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలకు పెద్దలపట్ల మర్యాదగా నడుచుకోవడం, వారికి పాద నమస్కారం చేసి ఆశీస్సులు తీసుకోవడం అలవాటుచేస్తారు. ఇదిలా ఉంటే ఓ చిన్నారి బాలిక షాపింగ్ మాల్‌కి వెళ్లింది. అక్కడ డిస్‌ప్లేలో పెట్టిన ఓ బొమ్మను చూసి తను ఏమనుకుందో ఏమో కానీ వెంటనే వెళ్లి నన్ను ఆశీర్వదించు అన్నట్టుగా ఆ బొమ్మ పాదాలకు నమస్కరించింది. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. బొమ్మ పాదాలను తాకి కళ్లకు అద్దుకుంటున్న ఆ చిన్నారి సంస్కారాన్ని చూసిన నెటిజన్లు మురిసిపోవడమే కాదు, నవ్వే ఓపిక లేదంటూ సరదా కామెంట్లు చేస్తున్నారు. ఓ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసిన ఈ వీడియోకు ‘ఇంతటి సంస్కారవంతురాలైన చిన్నారిని ఎక్కడైనా చూశారా..?’ అనే కాప్షన్ జోడించారు. కాగా ఈ వీడియోను ఇప్పటికే 89 లక్షలమంది వీక్షించగా, 3 లక్షల 42 వేలమంది లైక్ చేశారు. రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ‘అత్తారింటికి వెళ్లేందుకు ప్రాక్టీస్’ అని కొందరు, ఈ మాత్రం సంస్కారం ఉంటే అత్తాకోడళ్లకు గొడవలే ఉండవ’ని మరికొందరు, ‘నాకు ఈ అమ్మాయే కొడలిగా కావాలి’ అని ఇంకొందరు అంటున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Rana: నీనవ్వు నన్ను మళ్ళీ నీ ప్రేమలో పడేలా చేస్తుంది.. రానా భార్య.
Fact Video: లేడీస్ బి అలెర్ట్..! పొంచి ఉన్న ప్రమాదం.. విషపూరితమైన మేకప్ గురించి విన్నారా..?
Taraka Ratna: తారకరత్నని చూడటానికి వచ్చిన మతిస్థిమితం లేని వ్యక్తి.. బాలయ్యకు ఏదో చెప్తూ..
తక్కువ ఖర్చుతో యూరప్ ఎలా చుట్టేయాలి? కంప్లీట్ ట్రావెల్ గైడ్
రూ. 60 వేల విలువైన కెమెరా ఆర్డర్ పెడితే.. ఆన్లైన్ మోసం..
ప్రపంచంలోనే అత్యంత కఠినమైన డ్రైవర్ టెస్ట్, దాని ప్రయోజనాలు
18 లక్షల సార్లు స్కిప్పింగ్ చేస్తాడా ?? నెట్టింట జోరుగా చర్చ
పండ్లపై ఎలుకల మందు పూసి అమ్ముతున్న వ్యాపారులు
ఫ్రెంచ్ అబ్బాయి..యానాం అమ్మాయి పెళ్లి.. గుర్రపు బండిపై ఊరేగుతూ..
అర్ధరాత్రి టపాసుల మోత.. హడలెత్తిపోతున్న జనం

