సిలిండర్ల లోడుతో వెళ్తున్న వాహనం.. ప్రాణం పోతున్నా ??

సిలిండర్ల లోడుతో వెళ్తున్న వాహనం.. ప్రాణం పోతున్నా ??

Phani CH

|

Updated on: Jul 29, 2024 | 9:39 PM

అతను ఓ డ్రైవర్.. గ్యాస్ సిలిండర్ల లోడుతో వెళ్తున్న లారికి డ్రైవర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఒక్కసారిగా గుండెల్లో దడ మొదలైంది.. భరించలేని నొప్పి.. ఊపిరి ఆగినట్టు అనిపిస్తుంది.. కానీ చేతిలో స్టీరింగ్.. కాస్త పట్టు తప్పితే.. నడిరోడ్డుపై ఎంతోమంది ప్రాణాలు పోతాయి.. గుండెల్లో నొప్పిని పంటి కింద బిగబట్టి.. వాహనాన్ని మెల్లగా డివైడర్ వైపు తీసుకెళ్లాడు. అంతా బాధలోనూ వాహనాన్ని అతి కష్టం మీద డివైడర్ పైకి ఎక్కించి.. ఊపిరి వదిలేసాడు.

అతను ఓ డ్రైవర్.. గ్యాస్ సిలిండర్ల లోడుతో వెళ్తున్న లారికి డ్రైవర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఒక్కసారిగా గుండెల్లో దడ మొదలైంది.. భరించలేని నొప్పి.. ఊపిరి ఆగినట్టు అనిపిస్తుంది.. కానీ చేతిలో స్టీరింగ్.. కాస్త పట్టు తప్పితే.. నడిరోడ్డుపై ఎంతోమంది ప్రాణాలు పోతాయి.. గుండెల్లో నొప్పిని పంటి కింద బిగబట్టి.. వాహనాన్ని మెల్లగా డివైడర్ వైపు తీసుకెళ్లాడు. అంతా బాధలోనూ వాహనాన్ని అతి కష్టం మీద డివైడర్ పైకి ఎక్కించి.. ఊపిరి వదిలేసాడు. డ్రైవర్ క్యాబిన్లోనే స్టీరింగ్ పై వాలి ప్రాణాలు కోల్పోయాడు. ప్రాణాలు పోయే సమయంలోను బాధ్యతగా వ్యవహరించిన ఆ డ్రైవర్‌కి అంతా సలాం చేస్తున్నారు.. ఈఘటన విశాఖలో చోటుచేసుకుంది. విశాఖ గాజువాక ఆటోనగర్ కు చెందిన నరవ శ్రీనివాసరావు రోజు మాదిరిగానే విధులకు హాజరయ్యాడు. ఫిల్లింగ్ చేసిన 300 సిలిండర్లను లోడ్ చేసుకుని పారిశ్రామిక వాడలోని వీడీఆర్ గొడౌన్ మీదుగా మల్కాపురం వైపు వెళ్తున్నాడు . ఆ ప్రాంతంలో చమురు కంపెనీలు ఉన్నాయి. ఇంధన గొడౌన్లు కూడా ఉండే ప్రాంతం అది. వాహనం మారుతి జంక్షన్ వద్దకు వచ్చేసరికి డ్రైవర్‌ అస్వస్థతకు గురయ్యాడు. ఒక్కసారిగా గుండెలో నొప్పి ప్రారంభమైంది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

తన ప్రేమను కాదన్న టీచర్‌కు విద్యార్ధి వేధింపులు !! చివరకు ??

రోడ్డుపై దొర్లుకుంటూ వెళ్లే పుర్రెను పోలిన కారు !! నెట్టింట వైరల్‌ అవుతున్న వీడియో

గుండెపోటు రాకుండా ఉండాలంటే రోజూ ఇలా చేయండి !!

150కి పైగా రోగాలకు ఒక్కటే ఔషధం.. ఈ ఆకుతో అదిరిపోయే బెనిఫిట్స్‌

ప్రమాదంలో అమెరికా ప్రజాస్వామ్యం.. అందుకోసమే పోటీ నుంచి వైదొలిగా