Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Corona Virus: కరోనా సోకిన చిన్నారుల్లో లాంగ్ కొవిడ్ లక్షణాలు.. కారణాన్ని గుర్తించలేకపోయిన శాస్త్రవేత్తలు.. వీడియో

Corona Virus: కరోనా సోకిన చిన్నారుల్లో లాంగ్ కొవిడ్ లక్షణాలు.. కారణాన్ని గుర్తించలేకపోయిన శాస్త్రవేత్తలు.. వీడియో

Phani CH

|

Updated on: Sep 13, 2021 | 9:38 AM

కరోనా.. ఇది నిజంగానే మహమ్మారి.. మీ వ్యాక్సిన్‌లు, మీ ట్రీట్‌మెంట్‌లూ నన్నేమీ చెయ్యలేవంటూ మానవాళికి సవాలు విసురుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఏదో ఒకచోట ఏదో ఒక రూపంలో తన ప్రతాపాన్ని చూపిస్తోంది.

కరోనా.. ఇది నిజంగానే మహమ్మారి.. మీ వ్యాక్సిన్‌లు, మీ ట్రీట్‌మెంట్‌లూ నన్నేమీ చెయ్యలేవంటూ మానవాళికి సవాలు విసురుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఏదో ఒకచోట ఏదో ఒక రూపంలో తన ప్రతాపాన్ని చూపిస్తోంది. మొదటి వేవ్‌లో ప్రజలను విపరీతమైన ఆందోళనకు గురిచేసింది.. సెకెండ్‌ వేవ్‌ అంటూ వచ్చి లక్షలాది మందిని పొట్టన పెట్టుకుని ప్రపంచం మొత్తాన్ని భయభ్రాంతుల్ని చేసింది. ఇక థర్డ్‌ వేవ్‌.. చిన్నపిల్లలే టార్గెట్‌ అని హెచ్చరించింది. దీనిని ఎదుర్కోడానికి ప్రభుత్వాలు అప్రమత్తమై తగు చర్యలు చేపట్టారు. అయినా వదిలేది లేదంటున్న కరోనా నుంచి చిన్నారులకు దీర్ఘకాలం వేధింపులు తప్పవని నిపుణులు సూచిస్తున్నారు. కరోనా బారినపడి కోలుకున్న చిన్నారులను లాంగ్ కొవిడ్ దీర్ఘకాలం వేధిస్తుందని నిపుణులు చెబుతున్నారు. కరోనా నుంచి కోలుకున్న తర్వాత కూడా దానికి సంబంధించిన ఆరోగ్య సమస్యలు తలెత్తితే దానిని లాంగ్ కొవిడ్‌గా వ్యవహరిస్తారు.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Sunil: సునీల్‌‌‌కు బిగ్‌ ఆఫర్‌..!! ఏంటో తెలుసా..!! వీడియో

Know This: వినాయకునికి పార్వతీ దేవి ప్రాణం పోసింది ఎక్కడో తెలుసా? వీడియో