Viral Video: మాస్కులు పెట్టుకోండంటూ బాలుడి రిక్వెస్ట్.. పట్టించుకోని జనం! వీళ్లేం పర్యాటకులురా బాబోయ్!
కరోనా సెకండ్ వేవ్ తో దేశం అల్లాడిపోయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతానికైతే సెకండ్ వేవ్ ప్రమాదం తప్పినట్లేనని రిపోర్టులు వెల్లడిస్తున్నాయి.
Viral Video: కరోనా సెకండ్ వేవ్ తో దేశం అల్లాడిపోయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతానికైతే సెకండ్ వేవ్ ప్రమాదం తప్పినట్లేనని రిపోర్టులు వెల్లడిస్తున్నాయి. కానీ, అసలైన ప్రమాదం మూడో వేవ్ తో రానుందని మరో బాంబ్ పేల్చిన సంగతి తెలిసిందే. ఈ మహమ్మారి నుంచి ప్రమాదం ఇంకా తప్పిపోలేదు. అందుకే ప్రభుత్వాలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలను హెచ్చరిస్తున్నాయి. ‘మాస్కే మనకు రక్ష.. లేదంటే తప్పదు శిక్ష’ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు కూడా చూస్తూనే ఉన్నాం. అయినా కొంతమంది మాత్రం వీటిని పెడచెవిన పెడుతూనే ఉన్నారు. వారితోపాటు పక్కవారిని కూడా ప్రమాదంలోకి నెట్టేస్తున్న సంఘటనలు మనం వింటూనే ఉన్నాం. తాజాగా ఓ బాలుడు ప్రజలను మాస్క్ పెట్టుకోండయ్యా బాబు అంటూ హెచ్చరించిన వీడియో ఒకటి వైరల్ గా మారింది. వివరాల్లోక వెళ్తే.. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా అన్ లాక్ ప్రక్రియతో అన్ని కార్యకలాపాలు సాగుతున్నాయి. దీంతో హిమాచల్ ప్రదేశ్ లో పర్యాటక స్థలాలు పర్యాటకులతో ఫుల్ బిజీగా మారిపోయాయంట. హోటల్స్ కూడా నో రూమ్స్ అంటూ పెట్టే పరిస్థితిలో బుక్ అవుతున్నాయంట. అలాగే హిమాచల్ ప్రదేశ్ లో సిమ్లా, మనాలీ, ధర్మశాల, డల్ హౌసీ, నార్కండ లాంటి ప్రఖ్యాత టూరిస్టు ప్రాంతాలు పర్యాటకులతో కళకళలాడుతున్నాయి.
అంతా బాగానే ఉంది. కానీ, పర్యాటకులు మాత్రం సేఫ్టీ రూల్స్ ను పట్టించుకోవడం లేదు. మాస్క్ లు లేకుండా తిరుగుతూ పక్కవారిని ప్రమాదంలో పడేస్తున్నారు. ఈ మేరకు ధర్మశాలలో ఓ బాలుడు పర్యాటకులను మాస్కులు పెట్టుకోవాలంటూ కర్ర పట్టుకుని చెప్పడం మొదలు పెట్టాడు. కానీ, పర్యాటకులు మాత్రం నవ్వుతూ వెళ్లి పోతున్నారే తప్ప.. మాస్కులు మాత్రం పెట్టుకోవడం లేదు. బాలుడు ఎంతగా చెప్పినా.. తలాడిస్తూ వెళ్లిపోతున్నారు. దీనిని ఓ రూరిస్టు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు. దాంతో ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారింది. ఈ వీడియోని చూసిన నెటిజన్లు.. పర్యాటకులు టార్గెట్ చేసి, దారుణంగా కామెంట్లు చేశారు. బాలుగు అంతలా చెబుతున్నా.. ఎవ్వరూ పట్టించుకోవడం లేదంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ధర్మశాల లోకల్ అనే పేరుతలో ఇన్ స్టాగ్రామ్ లో ఈ వీడియో.. ‘చిన్న బాలుడు కనీసం కాళ్లకు చెప్పులు కూడా లేకుండా ప్రజలకు అవగామన కల్పిస్తున్నాడు. కానీ, ఆ బాలుడి మాటలు పెడచెవిన పెట్టిన వీరిని ఎమనాలి. ఇక్కడ చదుకున్నవారెవరు? చదువుకోని వారెవరు? అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో 2.47 లక్షల వ్యూస్ తో దూసుకపోతోంది. బాలుడి మాటలు వినకుండా పెడచెవిన పెట్టిన వీరిపై సోషల్ మీడియా గుర్రుగా ఉంది. కోవిడ్ కు అడ్డుకట్ట వేసే ప్రధాన ఆయుధం మాస్క్ మాత్రమే. మరి ఇలాంటి పిరస్థితుల్లో మాస్క్ లేకుండా అలా బహిరంగంగా తిరిగితే ఎలా అంటూ.. ప్రశ్నిస్తున్నారు.
View this post on Instagram
Also Read:
Golgappa Bride: పెళ్లిపీటల మీద పూల దండలకు బదులు పానీ పూరీలను ధరించిన నవ వధువు.. సోషల్ మీడియాలో వైరల్