Leopards: నాసిక్ లో పట్టపగలు చిరుతల సంచారం.. భయంతో జనం పరుగులు.
ఇటీవల క్రూర జంతువులు జనావాసాల్లోకి వస్తూ ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా మహారాష్ట్రలోని నాసిక్‌లో పట్టపగలు.. వీధుల్లో.. రెండు చిరుతపులులు స్వైర విహారం చేశాయి. నగరంలోని వీధుల్లో తిరుగుతూ ప్రజలను పరుగులు పెట్టించాయి. నగరంలోని సవతా నగర్ ప్రాంతంలో ఓ చిరుత సంచారాన్ని ప్రజలు ముందుగా గుర్తించారు. ఆ తర్వాత ఆ ప్రాంతానికి ఐదు కిలోమీటర్ల దూరంలోని గోవింద్ నగర్‌లో మరో చిరుత స్థానికుల కంటపడింది.
ఇటీవల క్రూర జంతువులు జనావాసాల్లోకి వస్తూ ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా మహారాష్ట్రలోని నాసిక్‌లో పట్టపగలు.. వీధుల్లో.. రెండు చిరుతపులులు స్వైర విహారం చేశాయి. నగరంలోని వీధుల్లో తిరుగుతూ ప్రజలను పరుగులు పెట్టించాయి. నగరంలోని సవతా నగర్ ప్రాంతంలో ఓ చిరుత సంచారాన్ని ప్రజలు ముందుగా గుర్తించారు. ఆ తర్వాత ఆ ప్రాంతానికి ఐదు కిలోమీటర్ల దూరంలోని గోవింద్ నగర్‌లో మరో చిరుత స్థానికుల కంటపడింది. రెండు చిరుతలూ వీధుల్లో తిరుగుతూ ఇళ్లలోకి చొరబడ్డాయి. దాంతో ప్రజలు భయంతో పరుగులు తీశారు. అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. అటవీ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని చిరుతలను బంధించేందుకు వీధుల్లో గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో కొన్ని గంటలపాటు శ్రమించి వాటిని పట్టుకున్నారు. మత్తు ఇంజెక్షన్ ద్వారా చిరుతలను బంధించినట్టు తెలుస్తోంది. చిరుతలు స్పృహ కోల్పోగానే వాటిని స్ట్రచ్చర్‌పై తీసుకెళ్లి వాహనాల్లో ఎక్కించి జూకి తరలించారు. దాంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కాగా, కాలనీల్లో చిరుతల సంచారానికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.