Vote: ఓటు వేసి తీరుతానంటున్న వందేళ్ల బామ్మ.! 104 ఏళ్ల వయసులో ఇంటినుంచే ఓటు.!.

Vote: ఓటు వేసి తీరుతానంటున్న వందేళ్ల బామ్మ.! 104 ఏళ్ల వయసులో ఇంటినుంచే ఓటు.!.

Anil kumar poka

|

Updated on: Nov 17, 2023 | 8:48 PM

ప్రజాస్వామ్య దేశంలో దేశ స్థితిగతులను మార్చేయగల శక్తి సామాన్యుడి చేతిలో ఉంటుంది. ఓటు ఒక వజ్రాయుధం లాంటిది. దానిని సక్రమంగా వినియోగిస్తే నేతల తలరాతలే కాదు, దేశస్థితిగతులను కూడా మార్చేయవచ్చు. అలాంటి ఓటు హక్కును వినియోగించుకునేందుకు సిద్ధమైంది ఓ శతాధిక వృద్ధురాలు. వందేళ్లు పైబడిన ఈ బామ్మ ఓటు హక్కు వినియోగించుకుని తీరుతానంటోంది.

ప్రజాస్వామ్య దేశంలో దేశ స్థితిగతులను మార్చేయగల శక్తి సామాన్యుడి చేతిలో ఉంటుంది. ఓటు ఒక వజ్రాయుధం లాంటిది. దానిని సక్రమంగా వినియోగిస్తే నేతల తలరాతలే కాదు, దేశస్థితిగతులను కూడా మార్చేయవచ్చు. అలాంటి ఓటు హక్కును వినియోగించుకునేందుకు సిద్ధమైంది ఓ శతాధిక వృద్ధురాలు. వందేళ్లు పైబడిన ఈ బామ్మ ఓటు హక్కు వినియోగించుకుని తీరుతానంటోంది. ఒక్క ఓటుతో నేతల తలరాతను మార్చ వచ్చంటూ .. ఓటును నోటాగానో.. లేక, అసలు ఓటే వేయకుండా నిర్లక్ష్యం వహించేవారికి ఓటు విలువను చాటి చెబుతోంది ఈ బామ్మ. ఓటుపట్ల నిర్లక్ష్యం వీడండంటూ పిలుపునిస్తోంది. నిర్మల్ జిల్లా భైంసా పట్టణానికి చెందిన చివాటే అన్నపూర్ణబాయి అనే 104 ఏళ్ల ఈ బామ్మ నవంబరు 30న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేయబోతుంది. 1957 నుండి తాను క్రమం తప్పకుండా ఓటువేస్తున్నానని తెలిపింది. ప్రాణమున్నంత వరకు ప్రజాస్వామ్య దేశంలో ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచిస్తోంది ఈ బామ్మ. 2020 మున్సిపల్ ఎన్నికల్లో ఈమె వీల్ చైర్లో వెళ్లి మరీ ఓటు వేసింది. కాగా.. ప్రస్తుతం ఆ బామ్మకు ఆరోగ్యం సహకరించకపోవడతో 12(డి) ఫామ్ అప్లై చేసుకుంది. ఇంటి నుంచే ఓటు హక్కు వినియోగించుకునేలా ఆఫీసర్లు చర్యలు చేపడుతున్నారు. సో.. ఈ ఏడాది ఇంటినుంచే తన ఓటు హక్కును వినియోగించుకోబోతోంది ఈ బామ్మ.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.