Viral: ఇల్లెక్కి గుడ్డుపెట్టిన కోడి..! నేరుగా పెనంలోకే.. నవ్వులు పూయిస్తున్న వీడియో
సోషల్ మీడియాలో ప్రతిరోజూ ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని విజ్ఞానంతోపాటు వినోదాన్ని కూడా పంచుతుంటాయి. కొన్ని వీడియోలు ఎంతగానో నవ్విస్తుంటాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో ఓ కోడి ఇంటిపైకి ఎక్కి గుడ్డు పెట్టింది. అది నేరుగా వెళ్లి పొయ్యిమీద ఉన్న పెనంలో పడి ఆమ్లెట్ అయిపోయింది... ఈ వీడియో చూసి నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు.
సోషల్ మీడియాలో ప్రతిరోజూ ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని విజ్ఞానంతోపాటు వినోదాన్ని కూడా పంచుతుంటాయి. కొన్ని వీడియోలు ఎంతగానో నవ్విస్తుంటాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో ఓ కోడి ఇంటిపైకి ఎక్కి గుడ్డు పెట్టింది. అది నేరుగా వెళ్లి పొయ్యిమీద ఉన్న పెనంలో పడి ఆమ్లెట్ అయిపోయింది.. ఈ వీడియో చూసి నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ చోట రేకుల షేడ్డుతో వేసిన ఇంటిపై ఒక కోడి కూర్చుని ఉంది. సరిగ్గా కోడి గుడ్డుపెట్టే ప్రదేశానికి కింద ఓ వ్యక్తి వంటకు సిద్ధం చేస్తున్నాడు. రేకుల షెడ్డుపై కోడి గుడ్డు పెట్టగానే..అది నేరుగా జారుకుంటూ వచ్చి అతడు వంట చేసేందుకు పెట్టిన కడాయిలోకి పడింది.. షాక్ తిన్న అతను ఒక్కసారిగా పైకి చూసాడు. రేకుల షెడ్డుపైన ఓ తెల్లని కోడిపెట్ట నాపని అయిపోయింది ఏమైనా చేసుకో అన్నట్టుగా తాపీగా వెళ్తూ కనిపించింది. ఇంతలో కడాయిలో ఆమ్లెట్ రెడీ అయిపోయింది. పెంకు తీసి అవతల పడేసి ఆమ్లెట్ ప్లేట్‌లో పెట్టుకొని మిగతా వంట కంటిన్యూ చేశాడు ఆ వ్యక్తి. ఈ వీడియోను ఓ యూజర్ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. నెట్టింట తెగ వైరల్ అవుతున్న ఈ వీడియోని ఒకటిన్నర మిలియన్లమందికి పైగా వీక్షించారు. వాటే ఫన్నీ అంటూ వీడియోను తెగ షేర్ చేస్తున్నారు. ప్రకృతి చేసిన అద్భుతం అంటూ కామెంట్లు చేస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.
డబ్బుసంచితో బైక్పై వెళ్తున్న రైతు.. ఇంటికి వెళ్లి చూడగా..
జ్వరంతో బాధపడుతున్న జగన్నాథుడు..15 రోజులు ఐసోలేషన్లోనే
రూ. 10 కోట్ల విలువైన పిజ్జాలు ఫ్రీగా ఇస్తోన్న డొమినోస్!
గుడిలో హుండీలనే కాదు.. వీటిని కూడా కొట్టేస్తున్నారు..
బిర్యానీ ఫ్రీ అన్నారు.. తీరా అక్కడికి వెళ్లాక..
జడ్చర్లలో వింత కాకి ప్రత్యక్షం.. అపశకునం అంటున్న స్థానికులు!
విద్యార్ధులతోపాటు యూనిఫాంలో ఉపాధ్యాయులు

