3000 ఏళ్లనాటి మొసలి మమ్మీ.. సీటీ స్కాన్ లో సంచలనం
ఈజిప్ట్ పిరమిడ్లు.. మమ్మీలకు ప్రసిద్ధి చెందింది. అయితే వాటి వెనుక చాలా కథలు ఉన్నాయి. మతపరమైన ఆచారాల ప్రకారం కొన్ని జంతువులను కూడా బలి ఇచ్చారని ఓ అధ్యయనం గుర్తించింది. ఇటీవల ఓ మమ్మీ మొసలిని గుర్తించిన శాస్త్రవేత్తలు దాన్ని అమెరికాలోని బర్మింగ్‌హామ్ మ్యూజియం ఆర్ట్ గ్యాలరీలో భద్రపరిచారు. ఆర్కియాలజీ జర్నల్‌లో ప్రచురించిన వివరాల ప్రకారం మొసలిని స్కాన్ చేసిన శాస్త్రవేత్తలు దాని పొట్టలో జీర్ణం కాని చేప, చేప హుక్ ను కనుగొన్నారు.
ఈజిప్ట్ పిరమిడ్లు.. మమ్మీలకు ప్రసిద్ధి చెందింది. అయితే వాటి వెనుక చాలా కథలు ఉన్నాయి. మతపరమైన ఆచారాల ప్రకారం కొన్ని జంతువులను కూడా బలి ఇచ్చారని ఓ అధ్యయనం గుర్తించింది. ఇటీవల ఓ మమ్మీ మొసలిని గుర్తించిన శాస్త్రవేత్తలు దాన్ని అమెరికాలోని బర్మింగ్‌హామ్ మ్యూజియం ఆర్ట్ గ్యాలరీలో భద్రపరిచారు. ఆర్కియాలజీ జర్నల్‌లో ప్రచురించిన వివరాల ప్రకారం మొసలిని స్కాన్ చేసిన శాస్త్రవేత్తలు దాని పొట్టలో జీర్ణం కాని చేప, చేప హుక్ ను కనుగొన్నారు. దీన్ని వేటాడి పట్టుకొచ్చిన వెంటనే బలి ఇచ్చినట్లు నిర్ధారించారు. పురాతన ఈజిప్టులో మనుషులనే కాకుండా.. వేలాది జంతువులను కూడా మమ్మిలుగా మార్చేవారు. ఈ తరుణంలో ఇటీవల కనుగొన్న మూడు వేల ఏళ్ల నాటి మొసలి మమ్మీ అతి పెద్దది. ఈజిప్టులోని ప్రజలు మొసలి చర్మాన్ని ధరించేవారని తెలుస్తోంది. శాస్త్రవేత్తలు అసలు మొసలి ఎలా చనిపోయిందో కనుగొనేందుకు యత్నించారు. మమ్మీ చేయబడే ముందు మొసలికి ఏం తినిపించారు? అంటే దాని కడుపులో ఇంకా ఆహారం మిగిలే ఉందా? ఎలా చంపారు? అనే పలు ప్రశ్నలు శాస్త్రవేత్తలకు తలెత్తాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఏటీఎం దొంగలతో హడలుతున్న విశాఖ..
దొంగతనం చేసి ప్రియురాలితో కలిసి తీర్థయాత్రలు
రోజూ ఈ జ్యూస్ తాగండి.. ఫలితం మీకే తెలుస్తుంది