రోజూ ఈ జ్యూస్‌ తాగండి.. ఫలితం మీకే తెలుస్తుంది

రోజూ ఈ జ్యూస్‌ తాగండి.. ఫలితం మీకే తెలుస్తుంది

Phani CH

|

Updated on: Aug 22, 2024 | 9:39 PM

వయసు పెరిగే కొద్దీ చర్మంపై ముడతలు పడకుండా ఉండాలంటే చర్మ సంరక్షణకు ప్రత్యేక శ్రద్ధ అవసరం. వయసు ప్రభావం చర్మంపై పడకూడదంటే క్రమం తప్పకుండా పాలు తాగాలి. పాలలో ప్రొటీన్, క్యాల్షియం ఉండటం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. కానీ లాక్టోస్ అలర్జీ ఉన్న వాళ్లు పాలకు బదులు సోయా పాలను క్రమం తప్పకుండా తాగవచ్చు. దీని వల్ల చర్మంపై ముడతలు రావు. చర్మ కాంతిని కాపాడుకోవడానికి ప్రతిరోజూ కనీసం ఒక కప్పు గ్రీన్ టీ తాగవచ్చు.

వయసు పెరిగే కొద్దీ చర్మంపై ముడతలు పడకుండా ఉండాలంటే చర్మ సంరక్షణకు ప్రత్యేక శ్రద్ధ అవసరం. వయసు ప్రభావం చర్మంపై పడకూడదంటే క్రమం తప్పకుండా పాలు తాగాలి. పాలలో ప్రొటీన్, క్యాల్షియం ఉండటం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. కానీ లాక్టోస్ అలర్జీ ఉన్న వాళ్లు పాలకు బదులు సోయా పాలను క్రమం తప్పకుండా తాగవచ్చు. దీని వల్ల చర్మంపై ముడతలు రావు. చర్మ కాంతిని కాపాడుకోవడానికి ప్రతిరోజూ కనీసం ఒక కప్పు గ్రీన్ టీ తాగవచ్చు. గ్రీన్ టీ శరీరం నుంచి అదనపు టాక్సిన్స్ తొలగించడానికి సహాయపడుతుంది. ఫలితంగా చర్మంపై ఒత్తిడి పడదు. దీంతో చర్మం తాజాగా ఉంటుంది. ఉదయం నిద్రలేచి ఒక కప్పు కాఫీ తాగితే శరీరం ఉల్లాసంగా ఉంటుంది. కాఫీ చర్మానికి కూడా మంచిది. చర్మ క్యాన్సర్, ఇతర వ్యాధులను నివారించడానికి ఈ పానీయం బలేగా సహాయపడుతుంది. కానీ మీరు ఎక్కువ కెఫిన్ తీసుకుంటే అది ప్రతికూలంగా పనిచేస్తుంది.చర్మ ప్రకాశాన్ని కాపాడుకోవడానికి క్యారెట్లు భలేగా సహాయపడతాయి. క్యారెట్ జ్యూస్ రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల చర్మానికి మంచిదని పలు పరిశోధనలు సైతం చెబుతున్నాయి.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఈ టీ రోజూ తాగితే అందం.. ఆరోగ్యం మీ సొంతం

14 ఏళ్ల తర్వాత మరోసారి జంటగా శివాజీ-లయ

మంటల్లో ఫెర్రీస్‌ వీల్‌.. సందర్శకుల హాహాకారాలు !!

కోట్లకు పడగలెత్తిన స్వీపర్‌..అతని ఇంట్లో 9 లగ్జరీ కార్లు

రామాలయంలో నాగదేవత ప్రత్యక్షం.. భయంతో పరుగులు తీసిన భక్తులు

Published on: Aug 22, 2024 09:32 PM