14 ఏళ్ల తర్వాత మరోసారి జంటగా శివాజీ-లయ
ఒకప్పటి టాలీవుడ్ హిట్ పెయిర్ శివాజీ, లయ మరోసారి వెండితెరపై జతకట్టనున్నారు. గతంలో వీరి కాంబినేషన్లో వచ్చిన మిస్సమ్మ, టాటా బిర్లా మధ్యలో లైలా, అదిరిందయ్యా చంద్రం చిత్రాలు ప్రేక్షకులను అలరించాయి. దాదాపు ఒకటిన్నర దశాబ్దం తర్వాత ఈ జంట మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తోంది. శివాజీ, లయ హీరోహీరోయిన్లుగా ఓ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ మూవీ రూపుదిద్దుకోనుంది. ఈ చిత్రానికి సుధీర్ శ్రీరామ్ దర్శకుడు.
ఒకప్పటి టాలీవుడ్ హిట్ పెయిర్ శివాజీ, లయ మరోసారి వెండితెరపై జతకట్టనున్నారు. గతంలో వీరి కాంబినేషన్లో వచ్చిన మిస్సమ్మ, టాటా బిర్లా మధ్యలో లైలా, అదిరిందయ్యా చంద్రం చిత్రాలు ప్రేక్షకులను అలరించాయి. దాదాపు ఒకటిన్నర దశాబ్దం తర్వాత ఈ జంట మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తోంది. శివాజీ, లయ హీరోహీరోయిన్లుగా ఓ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ మూవీ రూపుదిద్దుకోనుంది. ఈ చిత్రానికి సుధీర్ శ్రీరామ్ దర్శకుడు. దర్శకుడికి ఇదే తొలి చిత్రం. శివాజీ ఈ చిత్రానికి నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు. శివాజీ సొంత బ్యానర్ శ్రీ శివాజీ ప్రొడక్షన్స్ పతాకంపై ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రం ప్రారంభోత్సవం హైదరాబాదులో జరిగింది. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు క్లాప్ కొట్టారు. శివాజీ తనయుడు రిక్కీ కెమెరా స్విచాన్ చేశాడు. ఈ ఓపెనింగ్ సెర్మనీకి హాజరైన స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ముహూర్తం షాట్ కు దర్శకత్వం వహించారు. కాగా, ఈ సినిమాకు ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదు. ఆగస్టు 20 నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మంటల్లో ఫెర్రీస్ వీల్.. సందర్శకుల హాహాకారాలు !!
ఆంటీ అని పిలిచినందుకు.. మేల్ నర్స్‌కు జరిమానా
నేపాల్‌లో గుట్కా ఉమ్మిన భారతీయులు.. నీళ్లు పోసి కడిగించిన వీడియో
ప్రేతాత్మ తిరుగుతోందంటూ కాలేజీలో పూజలు
బార్బర్ షాపు ఓనర్ కి ₹72 లక్షల షాక్! GST నోటీసులతో లబోదిబో
కూతురికి విడాకులు మంజూరు.. బ్యాండ్ మేళంతో.. వేడుక చేసిన తండ్రి
నో ఫుడ్, నో ఫోన్.. అడవిలో తప్పిపోయిన టెకీ.. కట్ చేస్తే !!
గాయాలైనా సడలని ధైర్యం.. 7,000 అడుగుల కొండ ఎక్కిన పైలట్

