మంటల్లో ఫెర్రీస్‌ వీల్‌.. సందర్శకుల హాహాకారాలు !!

మంటల్లో ఫెర్రీస్‌ వీల్‌.. సందర్శకుల హాహాకారాలు !!

Phani CH

|

Updated on: Aug 22, 2024 | 9:24 PM

మ్యూజిక్‌ ఫెస్టివల్‌లో సరదాగా కాలక్షేపం చేస్తున్న వారికి భయానక అనుభవం ఎదురైంది. అక్కడ ఏర్పాటు చేసిన ఫెర్రీస్‌ వీల్‌ తిరుగుతుండగానే మంటలు చెలరేగాయి. దీంతో అందులో ఉన్న సందర్శకులు హాహాకారాలు పెట్టగా.. కింద ఉన్నవారు కూడా తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఈ ఘటనలో మొత్తంగా 30 మందికి గాయాలయ్యాయి. జర్మనీలోని సమ్మర్‌ ఫెస్టివల్‌లో జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

మ్యూజిక్‌ ఫెస్టివల్‌లో సరదాగా కాలక్షేపం చేస్తున్న వారికి భయానక అనుభవం ఎదురైంది. అక్కడ ఏర్పాటు చేసిన ఫెర్రీస్‌ వీల్‌ తిరుగుతుండగానే మంటలు చెలరేగాయి. దీంతో అందులో ఉన్న సందర్శకులు హాహాకారాలు పెట్టగా.. కింద ఉన్నవారు కూడా తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఈ ఘటనలో మొత్తంగా 30 మందికి గాయాలయ్యాయి. జర్మనీలోని సమ్మర్‌ ఫెస్టివల్‌లో జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. జర్మనీలోని లైప్‌సిగ్‌ నగరంలో స్టార్మ్‌థాలర్‌ సరస్సు ఒడ్డున సమ్మర్‌ ఫెస్టివల్‌ నిర్వహించారు. అక్కడ ఏర్పాటు చేసిన ఫెర్రీస్‌ వీల్‌ తిరుగుతున్న సమయంలో ఓ టబ్‌కు మంటలు అంటుకున్నాయి. గాల్లో తిరుగుతుండగానే అవి మరో టబ్‌కు వ్యాపించాయి. దట్టమైన పొగ వ్యాపించింది. దాంతో వీల్‌లో సందర్శకులతోపాటు కింద ఉన్న వేలాది మంది తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన నిర్వాహకులు జాయింట్‌ వీల్‌ తిరగకుండా నిలిపివేశారు. స్పందించిన అగ్నిమాపక సిబ్బంది.. మంటలు వ్యాపించకుండా నిరోధించారు. అప్పటికే దట్టమైన పొగ అలముకోవడంతో నలుగురు పోలీసు అధికారులతోపాటు మొత్తం 30 మంది అస్వస్థతకు గురయ్యారు. ఇద్దరికి మాత్రం తీవ్ర గాయాలైనట్లు అధికారులు వెల్లడించారు. సాంకేతిక సమస్య కారణంగానే వీల్‌లో మంటలు చెలరేగాయని నిర్వాహకులు వెల్లడించారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కోట్లకు పడగలెత్తిన స్వీపర్‌..అతని ఇంట్లో 9 లగ్జరీ కార్లు

రామాలయంలో నాగదేవత ప్రత్యక్షం.. భయంతో పరుగులు తీసిన భక్తులు