ఈ టీ రోజూ తాగితే అందం.. ఆరోగ్యం మీ సొంతం
చాలామందికి ఉదయాన్నే వేడి వేడిగా టీ తాగడం అలవాటు ఉంటుంది. అలాంటివారికి ఆరోగ్యకరమైన టీని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. ప్రతిరోజూ ఓ కప్పు ఈ టీ తాగితే అందం, ఆరోగ్యం రెండూ మీ సొంతం అంటున్నారు. అదే రోజ్‌మేరీ టీ. అవును.. ఇది పుదీనా ఫ్యామిలీకి చెందినది. దీనిని ఆయుర్వేద వైద్యంలో ఒక మూలికగా ఉపయోగిస్తారు.
చాలామందికి ఉదయాన్నే వేడి వేడిగా టీ తాగడం అలవాటు ఉంటుంది. అలాంటివారికి ఆరోగ్యకరమైన టీని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. ప్రతిరోజూ ఓ కప్పు ఈ టీ తాగితే అందం, ఆరోగ్యం రెండూ మీ సొంతం అంటున్నారు. అదే రోజ్‌మేరీ టీ. అవును.. ఇది పుదీనా ఫ్యామిలీకి చెందినది. దీనిని ఆయుర్వేద వైద్యంలో ఒక మూలికగా ఉపయోగిస్తారు. రోజు ఉదయం పూట రోజ్మేరీతో చేసిన టీని తీసుకోవటం వల్ల మరింత ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉంటారని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. దీనిని ఒకరకమైన హెర్బల్ టీగా చెబుతున్నారు. రోజ్మేరీ టీలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరంలో ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే ఆక్సీకరణ ఒత్తిడితో పోరాడుతుంది. కణాల నష్టం, వాపును తగ్గిస్తుంది. రోజ్మేరీ టీని ఖాళీ కడుపుతో తాగడం జీర్ణక్రియను నియంత్రించడంలో చాలా సహాయపడుతుంది. కడుపు ఉబ్బరం వంటి కడుపు సంబంధిత సమస్యలను కూడా ఇది నివారిస్తుంది. రోజ్మేరీ జ్ఞాపకశక్తి మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. రోజ్మేరీలోని యాంటీమైక్రోబయల్ లక్షణాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
14 ఏళ్ల తర్వాత మరోసారి జంటగా శివాజీ-లయ
మంటల్లో ఫెర్రీస్ వీల్.. సందర్శకుల హాహాకారాలు !!
87 ఏళ్లకు తండ్రి అయిన కోటీశ్వరుడు.. కట్ చేస్తే..
ఊరు ఊరంతా కరెంట్ షాక్.. సెల్ఫోన్ ఛార్జింగ్ పెడుతూ యువకుడు
పొదుపు చేయలేదు.. జాబ్ పోయింది.. టెకీ ఆవేదన
ప్రాణాలకు తెగించి వృద్ధ దంపతుల వీరోచిత పోరాటం
మెస్సికి కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన అనంత్ అంబానీ..
నీరు తోడుతుండగా వచ్చింది చూసి.. పరుగో పరుగు..
జోరు వానలో చిక్కుకున్న ఏనుగు.. గొడుగుగా మారిన తల్లి ఏనుగు..

