విమానంలో తోటి ప్యాసింజర్లపై మహిళ దాడి
విమానంలో ఓ మహిళ.. తోటి ఇద్దరు ప్రయాణికులు, సీఐఎస్‌ఎఫ్ సిబ్బందిపై దాడికి తెగబడింది. ఈ ఘటన పుణెలోని లోహెగావ్ ఎయిర్‌పోర్టులో జరిగింది. శనివారం ఉదయం 7. 45 గంటలకు పుణె నుంచి ఢిల్లీకి బయలుదేరే ఓ ప్రైవేటు ఎయిర్ లైన్స్‌కి చెందిన విమానంలో ఆ మహిళ ముందు సీట్లో ఉన్న ఇద్దరు ప్రయాణికులపై దాడి చేసింది. దీంతో ఉద్రిక్త పరిస్థితి చోటుచేసుకుంది.
విమానంలో ఓ మహిళ.. తోటి ఇద్దరు ప్రయాణికులు, సీఐఎస్‌ఎఫ్ సిబ్బందిపై దాడికి తెగబడింది. ఈ ఘటన పుణెలోని లోహెగావ్ ఎయిర్‌పోర్టులో జరిగింది. శనివారం ఉదయం 7. 45 గంటలకు పుణె నుంచి ఢిల్లీకి బయలుదేరే ఓ ప్రైవేటు ఎయిర్ లైన్స్‌కి చెందిన విమానంలో ఆ మహిళ ముందు సీట్లో ఉన్న ఇద్దరు ప్రయాణికులపై దాడి చేసింది. దీంతో ఉద్రిక్త పరిస్థితి చోటుచేసుకుంది. వెంటనే పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి విమాన సిబ్బంది, సీఐఎస్‌ఎఫ్ కానిస్టెబుల్స్ ఆమె వద్దకు వచ్చారు. దీంతో ఆమె మరింత రెచ్చిపోయి.. సీఐఎస్‌ఎఫ్ సిబ్బందిపైనా దాడి చేసింది. అనంతరం ఆ మహిళను, ఆమె భర్తను విమానం నుంచి దింపేశారు. ఆ మహిళను ఎయిర్ పోర్టు పోలీసులకు అప్పగించగా.. కేసు నమోదు చేశారు. విచారణ కోసం సదరు మహిళకు నోటీసు ఇచ్చి విడిచిపెట్టినట్లు పోలీసులు తెలిపారు. ఎయిర్‌లైన్ సిబ్బంది, సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది,సహ ప్రయాణీకులు వాంగ్మూలాలను రికార్డు చేశామన్నారు . వ్యక్తిగత అత్యవసర పరిస్థితి కారణంగా ఆమె తీవ్రమైన బాధలో ఉన్నట్లు గమనించామని, అందుకే ఆమె తోటి ప్రయాణికులతో వాగ్వాదానికి దిగారని ఓ సీఐఎస్‌ఎఫ్ కానిస్టేబుల్ తెలిపారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అతిపెద్ద సైబర్ మోసం.. రూ. 8.6 కోట్లు నష్టపోయిన హైదరాబాద్ వైద్యుడు
3000 ఏళ్లనాటి మొసలి మమ్మీ.. సీటీ స్కాన్ లో సంచలనం
ఏటీఎం దొంగలతో హడలుతున్న విశాఖ..
కొత్త రకం రెల్లుజాతి పామును చూసారా ??
అర్ధరాత్రి బాల్కనీలో చిక్కుకుపోయిన యువకులు..
స్కూళ్లలో ప్రతి శనివారం డ్యాన్స్‌లే..!
దిష్టిబొమ్మగా పెద్ద కళ్ళ మహిళ !! ఇంతకీ ఎవరీమె ??
ఛీ.. వీడు మనిషేనా ?? తల్లికి అనారోగ్యంగా ఉందని సెలవు అడిగితే
రూ.4 చోరీ కేసులో.. 51 ఏళ్లకు తీర్పు
మంచు సునామీ..ఎప్పుడైనా చూశారా..! షాకింగ్ వీడియో

