AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అతిపెద్ద సైబర్ మోసం.. రూ. 8.6 కోట్లు నష్టపోయిన హైదరాబాద్‌ వైద్యుడు

అతిపెద్ద సైబర్ మోసం.. రూ. 8.6 కోట్లు నష్టపోయిన హైదరాబాద్‌ వైద్యుడు

Phani CH
|

Updated on: Aug 22, 2024 | 9:44 PM

Share

సైబర్ క్రిమినల్స్ బారినపడిన హైదరాబాద్ వైద్యుడు ఒకరు ఏకంగా రూ. 8.6 కోట్లు చెల్లించుకున్నాడు. మోసపోయానని తెలిసి ఇప్పుడు గుండెలు బాదుకుంటున్నాడు. తెలంగాణలో నమోదైన అతిపెద్ద సైబర్ మోసం ఇదేనని పోలీసులు చెబుతున్నారు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరోకి బాధితుడు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. మే 21న వైద్యుడికి ఫేస్‌బుక్‌లో ఓ స్టాక్ బ్రోకింగ్ కంపెనీ పేరిట ప్రకటన కనిపించింది.

సైబర్ క్రిమినల్స్ బారినపడిన హైదరాబాద్ వైద్యుడు ఒకరు ఏకంగా రూ. 8.6 కోట్లు చెల్లించుకున్నాడు. మోసపోయానని తెలిసి ఇప్పుడు గుండెలు బాదుకుంటున్నాడు. తెలంగాణలో నమోదైన అతిపెద్ద సైబర్ మోసం ఇదేనని పోలీసులు చెబుతున్నారు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరోకి బాధితుడు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. మే 21న వైద్యుడికి ఫేస్‌బుక్‌లో ఓ స్టాక్ బ్రోకింగ్ కంపెనీ పేరిట ప్రకటన కనిపించింది. దీంతో అందులోని వివరాలను నింపాడు. ఆ వెంటనే కంపెనీ ప్రతినిధులమంటూ కొందరు వైద్యుడిని సంప్రదించి ఆయన ఫోన్ నంబరును నాలుగు వాట్సాప్ గ్రూపుల్లో చేర్చారు. ప్రముఖ కంపెనీల తరపున స్టాక్ బ్రోకర్లుగా తాము వ్యవహరిస్తున్నట్టు చెప్పారు. ఈ సందర్బంగా ఆయా సంస్థలు ఏవో చెప్పాలని వైద్యుడు అడిగితే అవి రహస్యమని, చెప్పడం కుదరదని స్పష్టం చేశారు. ఆ తర్వాత నాలుగు సంస్థల పేరిట యాప్ లింకులను పంపి వాటిలో డబ్బులు పెట్టుబడి పెట్టమన్నారు. ఆ తర్వాత వచ్చిన లాభాలను ఎప్పటికప్పుడు ఉపసంహరించుకోవచ్చని కూడా చెప్పారు. దీంతో పలుమార్లు పెట్టుబడులు పెట్టిన వైద్యుడు లాభాలను కూడా ఉపసంహరించుకున్నాడు. దీంతో వారిపై మరింత నమ్మకం కుదరడంతో విడదల వారిగా ఏకంగా రూ. 8.6 కోట్లు పెట్టుబడిగా పెట్టాడు. కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టిన తర్వాత లాభాల ఉపసంహరణకు వైద్యుడు ప్రయత్నించగా కుదరలేదు. లాభాల్లో 20 నుంచి 30 శాతం చెల్లిస్తేనే వాటిని ఉపసంహరించుకునే అవకాశం ఉందని చెప్పడంతో వైద్యుడు షాకయ్యాడు. ఆపై కస్టమర్ కేర్‌ను సంప్రదించే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోవడంతో తాను మోసపోయినట్టు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

3000 ఏళ్లనాటి మొసలి మమ్మీ.. సీటీ స్కాన్ లో సంచలనం

ఏటీఎం దొంగలతో హడలుతున్న విశాఖ..

దొంగతనం చేసి ప్రియురాలితో కలిసి తీర్థయాత్రలు

రోజూ ఈ జ్యూస్‌ తాగండి.. ఫలితం మీకే తెలుస్తుంది

ఈ టీ రోజూ తాగితే అందం.. ఆరోగ్యం మీ సొంతం