ఆత్మహత్యలను నివారిస్తాయా ?? కోటాలో కొత్త రకం ఫ్యాన్లు
రాజస్థాన్ ‘కోటా ’లోని కోచింగ్ సెంటర్లలో విద్యార్థుల వరుస ఆత్మహత్యలు కలవరపెడుతున్నాయి. దీంతో అప్రమత్తమైంది స్థానిక యంత్రాంగం. కోటాలోని అన్ని హాస్టళ్లు, పీజీల్లో స్ప్రింగ్ లోడెడ్ ఫ్యాన్లను ఏర్పాటు చేయాలని జిల్లా మేజిస్ట్రేట్ ఆదేశించారు. ఐఐటీ, నీట్ ఇతర పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు ఈ ఏడాది దాదాపు 2.5లక్షల మంది శిక్షణ తీసుకుంటున్నట్లు అంచనా. అయితే, ఈ ఏడాది ఇప్పటికే 20 మంది విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడ్డారు.
రాజస్థాన్ ‘కోటా ’లోని కోచింగ్ సెంటర్లలో విద్యార్థుల వరుస ఆత్మహత్యలు కలవరపెడుతున్నాయి. దీంతో అప్రమత్తమైంది స్థానిక యంత్రాంగం. కోటాలోని అన్ని హాస్టళ్లు, పీజీల్లో స్ప్రింగ్ లోడెడ్ ఫ్యాన్లను ఏర్పాటు చేయాలని జిల్లా మేజిస్ట్రేట్ ఆదేశించారు. ఐఐటీ, నీట్ ఇతర పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు ఈ ఏడాది దాదాపు 2.5లక్షల మంది శిక్షణ తీసుకుంటున్నట్లు అంచనా. అయితే, ఈ ఏడాది ఇప్పటికే 20 మంది విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడ్డారు. గత ఎనిమిదేళ్లతో పోలిస్తే ఈ ఏడాది కోటాలో ఆత్మహత్యల సంఖ్య ఎక్కువగా ఉంది. మృతి చెందిన విద్యార్థుల్లో ఎక్కువ మంది ఫ్యాన్‌కు ఉరేసుకునే మరణించినట్లు గుర్తించిన అధికారులు.. హాస్టళ్లు, పీజీ గదుల్లో తక్షణమే వాటిని తొలగించాలని నిర్ణయించారు. వాటి స్థానంలో స్ప్రింగ్ లోడెడ్ ఫ్యాన్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. లోడ్‌ను గుర్తించిన క్షణంలోనే అన్‌కాయిల్ అయ్యేలా ఈ ఫ్యాన్లను తయారుచేశారు. అంటే.. లోడ్ గుర్తించగా ఫ్యాన్ సీలింగ్ నుంచి విడిపోయి కిందకు వేలాడుతుంది. ప్రస్తుతం కోటాలోని హాస్టళ్లలో ఈ ఫ్యాన్లను వేగంగా ఏర్పాటు చేస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
థార్ ఎడారిలో పచ్చని చెట్లు .. పూల పరిమళాలు.. ఎప్పుడంటే ??
ఒక్క రోజు వధువుకి భారీ డిమాండ్ !! అక్కడ పురుషులు బ్రహ్మచారులుగా మరణించడం అశుభం
14 అడుగుల పొడవు.. 8 కేజీల బరువు.. ఇది కదా కింగ్ కోబ్రా అంటే ??
టాయిలెట్‌లో ఇరుక్కున్న బాలిక కాలు.. చివరికి ??
500 మీటర్ల దూరం కారు బానెట్‌పై యువతిని ఈడ్చుకెళ్లిన డ్రైవర్ !!