500 మీటర్ల దూరం కారు బానెట్‌పై యువతిని ఈడ్చుకెళ్లిన డ్రైవర్ !!
రాజస్థాన్‌లోని హనుమాన్‌గఢ్ జిల్లాలో దారుణ ఘటన జరిగింది. ఓ మహిళను ఓ వ్యక్తి కారు బానెట్‌పై సుమారు 500 మీటర్ల దూరం ఈడ్చుకెళ్లాడు. ఈ దృశ్యాలన్నీ సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. జంక్షన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ కారు రాంగ్ సైడ్‌లో వచ్చింది. ఇంతలో ఓ యువతి ఆ కారుకు అడ్డం వచ్చినట్లు వీడియోలో కనిపిస్తోంది. ఆ క్రమంలో కారు యువతి పైకి వెళ్లగా ఆమె రక్షణగా బానెట్‌ను పట్టుకుంది. అయితే డ్రైవర్ కారును ఆపకుండా అలాగే ముందుకు పోనిచ్చాడు.
రాజస్థాన్‌లోని హనుమాన్‌గఢ్ జిల్లాలో దారుణ ఘటన జరిగింది. ఓ మహిళను ఓ వ్యక్తి కారు బానెట్‌పై సుమారు 500 మీటర్ల దూరం ఈడ్చుకెళ్లాడు. ఈ దృశ్యాలన్నీ సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. జంక్షన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ కారు రాంగ్ సైడ్‌లో వచ్చింది. ఇంతలో ఓ యువతి ఆ కారుకు అడ్డం వచ్చినట్లు వీడియోలో కనిపిస్తోంది. ఆ క్రమంలో కారు యువతి పైకి వెళ్లగా ఆమె రక్షణగా బానెట్‌ను పట్టుకుంది. అయితే డ్రైవర్ కారును ఆపకుండా అలాగే ముందుకు పోనిచ్చాడు. ఇది చూసి స్థానికులు కారు వెంట పరుగులు తీశారు. అయినా డ్రైవరు కారును ఆపలేదు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా.. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించిన కారును గుర్తించామని జంక్షన్ స్టేషన్ ఇంఛార్జ్ విష్ణు ఖత్రి తెలిపారు. అయితే ఈ కేసులో దర్యాప్తు చేపట్టినప్పటికీ బాధితురాలి నుంచి ఎలాంటి ఫిర్యాదు అందలేదని చెప్పారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఫ్రెండ్స్‌పైనే పెప్పర్ స్ప్రే … ట్రై చేసిన అమ్మాయిల సస్పెన్షన్
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

