వింత ఘటన..పనస చెట్టుకు కాయలు కాదు.. డైరెక్ట్ తొనలే కాసేస్తున్నాయ్‌గా!
సాధారణంగా పనస చెట్టు కాండానికి కాయలు కాస్తాయి. అవి పెద్దగా అయి పక్వానికి వచ్చిన తర్వాత వాటిని కోసి తింటారు. కానీ ఓ పనస చెట్టు వింతకాపు కాసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. పనస కాయలు కాకుండా ఏకంగా తొనలే కాసాయి ఈ చెట్టుకి. ఈ వింత ఘటన అల్లూరు జిల్లాలో జరిగింది. జిల్లాలోని చింతపల్లి మండలం తమ్ముంగుల పంచాయతీ మారుమూల ప్రాంతమైన గిరిజన గూడెం కిమిలి సింగు గణేష్ అనే ఒక గిరిజనుడు నివాసం ఉంటున్నాడు.
అతను తన ఇంటి పెరట్లో ఓ పనస చెట్టు నాటాడు. ఏళ్లుగా ఆ పనస చెట్టు కాయలు కాస్తూ గణేష్ కు ఆదాయం తెచ్చిపెడుతుంది. సీజన్ వచ్చిందంటే చాలు గుత్తుల గుత్తులుగా కాయలు కాస్తూ ఉంటుంది ఆ పనస చెట్టు. అయితే ఈ ఏడాది ఆ చెట్టు విచిత్రమైన కాపు కాసింది. ఆ చెట్టుకు కాసిన కొన్ని పనసకాయల మధ్యన.. నేరుగా పనస తొనలు కనిపించాయి. తొలుత అంతగా పట్టించుకోని గణేష్.. ఆ తర్వాత అవి క్రమంగా పెద్దదవుతుంటే ఏమై ఉంటుందా అని పరిశీలించి చూసాడు. పనస తొనలే నేరుగా కనిపిస్తుండడంతో చూసి ఆశ్చర్యపోయాడు. పనస చెట్టు కాండానికి కాసిన కాయల మధ్య ఓ కాయ పొట్టలోంచి విచ్చుకొని బయటకు తొనలు వచ్చినట్టు కనిపిస్తున్నాయి. వాస్తవానికి పనస చెట్టుకు కాయలు కాస్తాయి. చెట్టు కాండానికి గుత్తుల గుత్తులుగా కాయలు కాస్తు కనిపిస్తాయి. అలా చెట్టుకు ఉన్న కాయల్లో తొనల కోసం చిన్న గాటు పెట్టిన సరే.. ఆ కాయ పెరగదు సరికదా కుళ్ళిపోతుంది. కానీ.. నేరుగా ఓ కాయ విచ్చుకొని.. అందులోంచి తొనలు బయటకు వచ్చి చెట్టుకే ఆ తొనలు పెరుగుతూ ఉండటం చూసి ఆశ్చర్యపోయాడు గణేష్. విషయం ఆ నోటా ఈ నోటా పాకడంతో.. చుట్టుపక్కల ప్రజలు ఆ వింతను చూసేందుకు గణేష్ ఇంటికి క్యూకడుతున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సూపర్ ఐడియా.. రిక్షా తొక్కలేక అతనేం చేశాడంటే..!
మీ ఇంట్లో ఈ 4 మొక్కలుంటే.. పట్టిందల్లా బంగారమే
పనిమనిషితో యవ్వారం.. ఉరితాడుకు పెళ్లాం..! సస్పెన్స్‌తో నరాలు తెగిపోవడం పక్కా
సంక్రాంతి వచ్చిందంటే నిజామాబాద్ లో నోరూరించే ఘేవర్ స్వీట్
వాళ్లు సంక్రాంతికి ఊరెళ్లారు.. వీళ్లు 10 ఇళ్లను దోచేశారు
బామ్మ అంత్యక్రియలకు వచ్చి.. ఆమె బర్త్డే కేక్ తిని వెళ్లారు?
హైదరాబాద్ లో మూడు రోజుల పాటు హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్
ఆహా..రావులపాలెంలో సంక్రాంతి పండుగ ఘుమఘుమలు
ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో సంక్రాంతి వేడుకలు
తెలుగు రాష్ట్రాల్లో మాంజా డేంజర్బెల్స్.. వరుస ప్రమాదాలతో టెర్రర్

