Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీ ఇంట్లో ఈ 4 మొక్కలుంటే.. పట్టిందల్లా బంగారమే

మీ ఇంట్లో ఈ 4 మొక్కలుంటే.. పట్టిందల్లా బంగారమే

Phani CH
|

Updated on: Jun 22, 2025 | 2:26 PM

Share

మీ ఇంట్లో ఆర్థిక సమస్యలున్నాయా? మీరు మొదలు పెట్టిన ప్రతి పనికీ ఆటంకాలు ఎదురవుతున్నాయా? అయితే.. ఈ మొక్కలను మీ ఇంట్లో పెంచుకోవాల్సిందే. మీ ఇంటికి ఆనందాన్ని, అదృష్టాన్ని తీసుకొచ్చే ఆ మొక్కలేంటి? వాటి ప్రత్యేకతలేంటో తెలుసుకుందాం. హిందువులు తులసిని పవిత్రమైన మొక్కగా భావిస్తారు. దేవతా స్వరూపిణిగా తులసిని భావించి, నిత్యం పూజిస్తారు.

పల్లెటూళ్లలో నేటికీ ప్రతి ఇంటిలోనూ తులసి కోట కనిపిస్తుంది. ఇటు పట్టణాల్లోని అపార్ట్‌మెంట్లలోనూ చిన్న చిన్న కుండీలలో తులసిని పెంచి, ఆరాధించటం మనకు తెలిసిందే. సకల శుభాలను తీసుకొచ్చే లక్ష్మీదేవి స్వరూపంగా తులసిని హిందువులు భావిస్తారు. వాస్తు ప్రకారం, ఇంటికి ఉత్తరం లేదా ఈశాన్య దిశలో తులసి మొక్కను పెంచటం చాలా శుభప్రదంగా భావిస్తారు. శ్రీమహా విష్ణువు, లక్ష్మీదేవి తులసి మొక్కలో నివాసముంటారని పురాణ వచనం. పవిత్రమైన తులసి ఆకులు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయని ఆయుర్వేదం చెబుతోంది.ఇక.. వెదురు మొక్కను కూడా చాలామంది పవిత్రమైనదిగా భావిస్తారు. ముఖ్యంగా ఫెంగ్‌షుయ్ వాస్తులో ఈమొక్కను ప్రశాంతత, కీర్తి ప్రతిష్టలు, డబ్బు, అదృష్టాన్ని తెచ్చే మొక్కగా చెబుతారు. దీనిని ఎవరికైనా బహుమతిగా ఇవ్వటమూ మంచిదేనని బౌద్ధులు విశ్వసిస్తారు. అందుకే పలు తూర్పు ఆసియా దేశాలలో చాలామంది తమ ఇంటి ఆవరణలో వెదురు మొక్కలను పెంచుకుంటారు. ఇక.. సంపదను ఆకర్షించే మొక్కలలో మనీ ప్లాంట్‌ కూడా ఒకటి. ఇది విజయాన్ని, సంపదను ఆకర్షిస్తుందని పలువురి విశ్వాసం. ముఖ్యంగా ఇది ఆర్థిక సమస్యలను తగ్గిస్తుందని నమ్ముతారు. ఈ మొక్కను ఇంటికి ఆగ్నేయ మూలన పెంచుకుంటే మంచి ఫలితాలొస్తాయని, ఈ మొక్కను ఎవరికీ బహుమతిగా ఇవ్వకూడదనీ పలువురి విశ్వాసం. ఇక.. అదృష్టాన్ని తెచ్చే మరో మొక్క… జడ్ ప్లాంట్‌. ఈ మొక్క పెరుగుదలకు తగినట్లుగానే దానిని పెంచే వ్యక్తి జీవితంలో సక్సెస్ ఉంటుందని చెబుతారు జేడ్ మొక్క స్నేహం, కుటుంబ, స్నేహ బంధాలను బలోపేతం చేస్తుందని నమ్ముతారు. అలాగే ఆర్థిక సమస్యలనూ ఇది దూరం చేస్తుందని చెబుతారు. అలాగే, ఉసిరి చెట్టును కూడా దేవతా స్వరూపంగా హిందువులు భావిస్తారు. లక్ష్మీ స్వరూపమైన ఉసిరి చెట్టు, దాని కాయలు విష్ణుమూర్తికి అత్యంత ఇష్టమైన వాటిగా మన పురాణాలు చెబుతున్నాయి. ఈ మొక్కను ఇంటికి ఉత్తరం లేదా తూర్పు దిశలో పెంచాలి. ఈ దిశలో ఉసిరి చెట్టుంటే ఆ ఇంటిలో సంపద, శాంతి నెలకొంటాయని భావిస్తారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పనిమనిషితో యవ్వారం.. ఉరితాడుకు పెళ్లాం..! సస్పెన్స్‌తో నరాలు తెగిపోవడం పక్కా

వేసవి తాపం నుంచి తప్పించుకోడానికి ఇతని ఐడియా అదుర్స్‌

ఖాళీ కడుపుతో కొబ్బరి తింటే అద్భుతమైన ప్రయోజనాలు

అరటి పువ్వా.. అని తీసిపారేయకండి.. వారికి ఇది దివ్యౌషధం

పచ్చి బాదం పప్పు తింటే ఎన్ని ప్రయోజనాలో తెలిస్తే వదలరు