Moon Photos: చంద్రుడి అద్భుత ఫొటోలు మా వద్ద ఉన్నాయి.. త్వరలో విడుదల చేస్తాం: ఇస్రో ఛైర్మన్‌

Moon Photos: చంద్రుడి అద్భుత ఫొటోలు మా వద్ద ఉన్నాయి.. త్వరలో విడుదల చేస్తాం: ఇస్రో ఛైర్మన్‌

Anil kumar poka

|

Updated on: Aug 31, 2023 | 9:37 PM

చంద్రుడిపై ఇస్రో పంపిన చంద్రయాన్ 3 రోవర్ ప్రయోగాలను కొనసాగిస్తోంది. ఈ క్రమంలో ఇస్రో చైర్మన్ సోమనాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రుడికి సంబంధించి ఇప్పటి వరకు ప్రపంచంలో ఏ దేశం తీయని అద్భుతమైన ఫొటోలు తమ వద్ద ఉన్నాయని చెప్పారు. అవి తమ కంప్యూటర్‌ సెంటర్కు వెళ్తున్నాయని.. అక్కడ శాస్త్రవేత్తలు వాటిని ప్రాసెస్‌ చేస్తున్నారని తెలిపానే. త్వరలోనే ఆ ఫొటోలను విడుదల చేస్తామన్నారు.

చంద్రుడిపై ఇస్రో పంపిన చంద్రయాన్ 3 రోవర్ ప్రయోగాలను కొనసాగిస్తోంది. ఈ క్రమంలో ఇస్రో చైర్మన్ సోమనాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రుడికి సంబంధించి ఇప్పటి వరకు ప్రపంచంలో ఏ దేశం తీయని అద్భుతమైన ఫొటోలు తమ వద్ద ఉన్నాయని చెప్పారు. అవి తమ కంప్యూటర్‌ సెంటర్కు వెళ్తున్నాయని.. అక్కడ శాస్త్రవేత్తలు వాటిని ప్రాసెస్‌ చేస్తున్నారని తెలిపానే. త్వరలోనే ఆ ఫొటోలను విడుదల చేస్తామన్నారు. ఇక జాబిల్లిపై ప్రజ్ఞాన్‌ రోవర్‌ ఇంకా విక్రమ్‌ ల్యాండర్‌ సమర్థంగా పనిచేస్తున్నాయని సోమనాథ్ చెప్పారు. వచ్చే 10 రోజుల్లో ల్యాండర్‌, రోవర్‌లు అన్ని పరిశోధనలను పూర్తిచేస్తాయన్నారు. విక్రమ్‌ ల్యాండర్‌ దిగిన చోటుకు శివ్‌శక్తి అనే పేరును ప్రధాని మోదీ పెట్టడాన్ని సోమనాథ్‌ సమర్థించారు. శివ్‌శక్తి, తిరంగా రెండు పేర్లూ భారతీయతకు చిహ్నమన్నారు. అంతేకాకుండా చంద్రుడితోపాటు అంగారక, శుక్ర గ్రహాలపైకి వ్యోమనౌకలను పంపే సత్తా భారత్‌కు ఉందని స్పష్టం చేశారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..