Neeraj Chopra: నీరజ్ చోప్రా ఆటోగ్రాఫ్ కోరిన విదేశీ మహిళ.. ఎక్కడపెట్టాడో తెలుసా..?

Neeraj Chopra: నీరజ్ చోప్రా ఆటోగ్రాఫ్ కోరిన విదేశీ మహిళ.. ఎక్కడపెట్టాడో తెలుసా..?

Anil kumar poka

|

Updated on: Aug 31, 2023 | 10:02 PM

టోక్యో ఒలింపిక్స్‌ స్వర్ణంతో చరిత్రకెక్కిన భారత స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్‌ లోనూ బంగారు పతకం సాధించి ఔరా అనిపించాడు. ఈ ఘనత సాధించిన తొలి భారతీయుడిగా నిలిచాడు. దాంతో, నీరజ్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. నీరజ్ కు ఇప్పటికే భారత్ తో పాటు విదేశాల్లోనూ ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ప్రపంచ అథ్లెటిక్స్ లో చారిత్రక విజయం తర్వాత..

టోక్యో ఒలింపిక్స్‌ స్వర్ణంతో చరిత్రకెక్కిన భారత స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్‌ లోనూ బంగారు పతకం సాధించి ఔరా అనిపించాడు. ఈ ఘనత సాధించిన తొలి భారతీయుడిగా నిలిచాడు. దాంతో, నీరజ్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. నీరజ్ కు ఇప్పటికే భారత్ తో పాటు విదేశాల్లోనూ ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ప్రపంచ అథ్లెటిక్స్ లో చారిత్రక విజయం తర్వాత స్టేడియంలోని అభిమానుల దగ్గరికి వెళ్లిన నీరజ్ అడిగిన వారితో ఫొటోలు దిగి, ఆటోగ్రాఫ్స్ ఇచ్చాడు. ఈ క్రమంలో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఓ హంగేరీ మహిళ నీరజ్ ను కలిసి ఆటోగ్రాఫ్ ఇవ్వాలని కోరింది. సరేఅని ఆటోగ్రాఫ్‌ ఇచ్చేందుకు రెడీ అయిన నీరజ్‌ ముందు భారత జాతీయపతాకాన్ని వుంచింది. దానిపై ఆటోగ్రాఫ్‌ పెట్టమని కోరింది. కానీ, త్రివర్ణ పతాకంపై మాత్రం సంతకం చేయను అని నీరజ్ ఆమెతో చెప్పాడు. చివరకు ఆమె ధరించిన టీ షర్ట్ స్లీవ్ పై నీరజ్ ఆటోగ్రాఫ్ తీసుకుంది ఆ మహిళ. దాంతో ఆమె ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. అదే సమయంలో భారత జెండాపై గౌరవంతో దానిపై సంతకం చేయని నీరజ్ పైనా ప్రశంసలు కురుస్తున్నాయి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..